EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/braitains-strain-corona-virus-making-telangana-shivering4370aada-11e2-442d-af69-d45a69494428-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/braitains-strain-corona-virus-making-telangana-shivering4370aada-11e2-442d-af69-d45a69494428-415x250-IndiaHerald.jpgఆదిలాబాద్ లో 19 మంది, కరీంనగర్లో 16 మంది, నిర్మల్ లో ముగ్గురు, వరంగల్లో ఇద్దరు, రంగారెడ్డిలో 210 మంది ఇలా పీస్ మీల్లాగ కొందరి అడ్రస్సులను మాత్రమే అధికారులు ట్రేస్ చయగలుగుతున్నారు. విమాన టిక్కెట్లపైన, ప్యాసెంజర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరి అడ్రస్సులు కనబడుతున్నా ఆ అడ్రస్సులో చాలామంది ఉండటం లేదని అర్ధమైపోతోంది. ఎందుకంటే విదేశాల నుండి వచ్చే వాళ్ళందరు ముందు శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలోనే దిగుతారు. కానీ ఆ తర్వాత తమిష్టం వచ్చిన చోటకు వెళ్ళిపోతారు. బ్రిటన్ నుండి బయలుదేరిన వాళ్ళు ఢిల్లీలో దిగుతుbritain strain corona telangana kcr samshabad delh;tara;hyderabad;kanna lakshminarayana;december;international;shamshabad;adilabad;coronavirusహెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణాను బ్రిటన్ ‘స్ట్రెయిన్’ ఎంతలా వణికించేస్తోందా తెలుసా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణాను బ్రిటన్ ‘స్ట్రెయిన్’ ఎంతలా వణికించేస్తోందా తెలుసా ?britain strain corona telangana kcr samshabad delh;tara;hyderabad;kanna lakshminarayana;december;international;shamshabad;adilabad;coronavirusFri, 25 Dec 2020 05:00:00 GMTఎక్కడో బ్రిటన్లో రూపాంతరం చెందిన స్ట్రెయిన్ కరోనా వైరస్ తెలంగాణాను వణికించేస్తోంది. గడచిన కొద్దిరోజులుగా స్ట్రెయిన్ కరోనా వైరస్ బ్రిటన్ను ఎంతలా వణికించేస్తోందో అందరికీ తెలిసిందే. అలాంటి స్ట్రెయిన్ తాజాగా తెలంగాణాను కూడా వణికించేస్తోంది. ఎలాగంటే బ్రిటన్ నుండి డిసెంబర్ నెలలో సుమారు మూడు వేలమంది వచ్చారు. వీరిలో 800 మంది హైదరాబాద్ లోనే ఉన్నారట. తాజాగా స్ట్రెయిన్ విజృంభణ కారణంగా బ్రిటన్ నుండి వచ్చిన వాళ్ళల్లో ఎంతమందికి కరోనా ఉందో తెలీక ఉన్నతాధికారులు నానా అవస్తలు పడుతున్నారు. వచ్చిన వాళ్ళ ఆచూకీ తెలుసుకుని, వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ సేకరించి అర్జంటుగా పూణేలోని నేషనల్ ల్యాబరేటరీకి పంపాలనేసరికి ఉన్నతాధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళల్లో చాలామంది అడ్రస్సులు సరిగా ట్రేస్ కావటం లేదు కాబట్టే.




ఆదిలాబాద్ లో 19 మంది, కరీంనగర్లో 16 మంది, నిర్మల్ లో ముగ్గురు, వరంగల్లో ఇద్దరు, రంగారెడ్డిలో 210 మంది ఇలా పీస్ మీల్లాగ కొందరి అడ్రస్సులను మాత్రమే అధికారులు ట్రేస్ చయగలుగుతున్నారు. విమాన టిక్కెట్లపైన, ప్యాసెంజర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరి అడ్రస్సులు కనబడుతున్నా ఆ అడ్రస్సులో చాలామంది ఉండటం లేదని అర్ధమైపోతోంది. ఎందుకంటే విదేశాల నుండి వచ్చే వాళ్ళందరు ముందు శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలోనే దిగుతారు. కానీ ఆ తర్వాత తమిష్టం వచ్చిన చోటకు వెళ్ళిపోతారు. బ్రిటన్ నుండి బయలుదేరిన వాళ్ళు ఢిల్లీలో దిగుతున్నట్లుంటుంది టిక్కెట్లలో. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళేది ఉండదు. కాబట్టి తెలంగాణా వాళ్ళందరు హైదరాబాద్ లోనే దిగాలి కాబట్టి శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా ప్రభుత్వం కౌంటర్లు పెట్టింది. అయితే కౌంటర్లు పెట్టినా ప్రయాణీకులందరు అక్కడ రిపోర్టు చేయకుండానే తమ సొంతూర్లకు వెళ్ళిపోయారు. దాంతో అందరి అడ్రస్సులను పట్టుకోవటం అధికారులకు తలకుమించిన పనైపోతోంది.




మామూలు కరోనా వైరస్ కన్నా స్ట్రెయిన కరోనా 70 శాతం అధిక ప్రమాధకరమని, అంతే వేగంతో వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతుండటం అందరికీ తెలిసిందే.  ఈ కారణంగానే బ్రిటన్ నుండి వచ్చిన వాళ్ళల్లో ఎంతమందికి స్ట్రెయిన్ కరోనా వైరస్ ఉంది, ఎంతమందిలో స్ట్రెయిన్ కరోనా లక్షణాలున్నాయన్నది తెలీదు. అలా వచ్చిన వాళ్ళల్లో ఎవరికైనా రెండు రకాలు కరోనా వైరస్ గనుక ఉంటే వాళ్ళ వల్ల ఎంతమందికి పాకుతుందో అధికారులు అంచనాలు వేయలేకపోతున్నారు. వాళ్ళ అడ్రస్సులో తెలుసుకోవటంలో ఆలస్యం అయ్యేకొద్దీ వ్యాప్తి తీవ్రత పెరిగిపోతుందన్నది అధికారుల టెన్షన్. కానీ చేయగలిగేది ఏమి లేదు. ఎందుకంటే ప్రయాణీకుల్లో కూడా బాధ్యత ఉండాలి. తమ ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటోంన్న విషయాన్ని గుర్తించాలి. గచ్చిబౌలీ స్టేడియంలో ప్రత్యేకించి బ్రిటన్ నుండి వచ్చిన వాళ్ళ కోసం బెడ్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వచ్చిన వాళ్ళందరి అడ్రస్సులు తెలిసేంతవరకు ప్రభుత్వానికి టెన్షన్ తప్పేలా లేదు.






హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రోజా అడ్డాలో టీడీపీ చేతులెత్తేసినట్లేనా..

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>