PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/smartf739cd59-11e7-453c-9c6e-2adae6b987a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/smartf739cd59-11e7-453c-9c6e-2adae6b987a5-415x250-IndiaHerald.jpgఈ మధ్య యువత ఫోన్లకు ఎక్కువ సమయం అతుక్కుపోతున్నారు. టెక్నాలజీ పెరగడం ఒక ఎత్తైతే.. ఇప్పుడు కరోనా భయం వల్ల పాఠశాల యాజమాన్యాలు కూడా ఆన్ లైన్ క్లాసులకు ఏర్పాటు చేయడంతో 24 గంటలు ఫోన్ లోనే గడిపేస్తున్నారు.. ఉన్నవాళ్లు తమ పిల్లలకు రక రకాల స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఫోన్లు కొనే స్థోమత లేకపోవడంతో సర్కారు బడులను ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. కాగా, తల్లి దండ్రులకు క్లాసులు వినడానికి స్మార్ట్ ఫోన్ కూడా లేదని ఓ విద్యార్థి నిరాశకు గురైంది.. అంతే కాదు తీవ్ర మనస్థాపానికి smart;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;roja;telangana;district;smart phone;police;school;village;marriage;diploma;sucide;murder.;siddipet;peddapalliఫోన్ లేదని తల్లి దండ్రులకు షాక్ ఇచ్చిన కూతురు..విషాదం..ఫోన్ లేదని తల్లి దండ్రులకు షాక్ ఇచ్చిన కూతురు..విషాదం..smart;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;roja;telangana;district;smart phone;police;school;village;marriage;diploma;sucide;murder.;siddipet;peddapalliFri, 25 Dec 2020 15:00:00 GMTటెక్నాలజీ పెరగడం ఒక ఎత్తైతే.. ఇప్పుడు కరోనా భయం వల్ల పాఠశాల యాజమాన్యాలు కూడా ఆన్ లైన్ క్లాసులకు ఏర్పాటు చేయడంతో 24 గంటలు ఫోన్ లోనే గడిపేస్తున్నారు.. ఉన్నవాళ్లు తమ పిల్లలకు రక రకాల స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఫోన్లు కొనే స్థోమత లేకపోవడంతో సర్కారు బడులను ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. కాగా, తల్లి దండ్రులకు క్లాసులు వినడానికి స్మార్ట్ ఫోన్ కూడా లేదని ఓ విద్యార్థి నిరాశకు గురైంది.. అంతే కాదు తీవ్ర మనస్థాపానికి గురైన చిన్నారి ఆత్మ హత్య చేసుకుంది. 



వివరాల్లోకి వెళితే..పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. రామగుండం మండలం న్యూ పోరట్‌పల్లికి చెందిన కోకా రమేష్, పల్లవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురికి పెళ్లి చేసి పంపించారు. రెండో కూతురు రోజా సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఆఖరి సంవత్సరం చదువుతుంది..లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రోజా ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు స్మార్ట్‌ఫోన్ కావాలని తండ్రిని అడిగింది. ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రమేష్‌‌కి డబ్బు సర్దుబాటు కాకపోవడంతో స్మార్ట్‌ఫోన్ కొనలేకపోతున్నా అని చెప్పాడు..తరగతులు ప్రారంభం అయ్యేవరకు వేచి చూడమని కోరాడు. 



దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రోజా అఘాయిత్యానికి ఒడిగట్టింది. తల్లిదండ్రులు గురువారం ఉదయం సమీపంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది.బంధువుల ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూతురు ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది.. హుటా హూటిన ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలను కోల్పోయింది..నా చావుకు ఎవరూ కారణం కాదు.. నేను కారణం అని రాసి ఉంచిన సూసైడ్ నోట్ లభ్యమైంది. పెళ్లికి ఎదిగి వచ్చిన కూతురు ఇలా చనిపోవడంతో ఆ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. వారి విషాద గాథ తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. 




మంచు మనోజ్ డెడికేషన్ కి హాట్స్ ఆఫ్...!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్

దొంగతనాలు చేస్తున్న మంత్రిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

వినియోగదార్లకు టెస్లా క్రిస్మస్ గిఫ్ట్.. అబ్బో భలే ఉందిగా!

ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>