PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jc-family-versus-mla-peddareddy-in-tadipatri71a9b57b-717c-48e4-b88b-8e7ec63fd004-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jc-family-versus-mla-peddareddy-in-tadipatri71a9b57b-717c-48e4-b88b-8e7ec63fd004-415x250-IndiaHerald.jpgచాలా కాలం తర్వాత తాడిపత్రి రాజకీయాల్లో రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయ్యాయి. మొదటి నుంచి తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, జేసీ ఫ్యామిలీకి పెద్దగా పడదనే విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాలు ఉప్పు-నిప్పు మాదిరిగా ఉంటున్నాయి. పైగా ఓడిపోయాక తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ యాక్టివ్ అయ్యింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు. tadipatri;prabhakar;prabhakar reddy;government;police;chintamaneni prabhakar;mla;tdp;ycp;parakala prabhakar;reddy;dookudu;racchaతాడిపత్రి రగడ: జేసీ ఫ్యామిలీ టార్గెట్ అదేనా?తాడిపత్రి రగడ: జేసీ ఫ్యామిలీ టార్గెట్ అదేనా?tadipatri;prabhakar;prabhakar reddy;government;police;chintamaneni prabhakar;mla;tdp;ycp;parakala prabhakar;reddy;dookudu;racchaFri, 25 Dec 2020 01:00:00 GMTవైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, జేసీ ఫ్యామిలీకి పెద్దగా పడదనే విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాలు ఉప్పు-నిప్పు మాదిరిగా ఉంటున్నాయి. పైగా ఓడిపోయాక తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ యాక్టివ్ అయ్యింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఇటు పెద్దారెడ్డి వర్గం కూడా దూకుడుగానే వెళుతుంది. అయితే ఈ వీరి అనుచరవర్గాలు బయటే కాకుండా సోషల్ మీడియాలో సైతం మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పోస్టులు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్దారెడ్డి భార్యను ఉద్దేశించి అనుచిత, అసభ్యకరమైన, అవాస్తవాలతో కూడిన పోస్టులు పెట్టానర జేసీ వర్గంపై పెద్దారెడ్డి వర్గం గుర్రుగా ఉంది. పోస్టుల వ్యవహారం అంతకంతకూ పెద్దది కావడంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. ఏకంగా జేసీ ఇంటికి వెళ్లి వీరంగం సృష్టించారు.

సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన జేసీ వర్గానికి చెందిన వ్యక్తిపై పెద్దారెడ్డి దాడి చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఆ సమయంలో జేసీ కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో లేరని తెలిసింది. ఇక వారు వచ్చాక రచ్చ మరింత ఎక్కువైనట్లు తెలిసింది. ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి జేసీ ఇంటికి వచ్చారని తెలియగానే టీడీపీ వర్గీయులు పెద్ద సంఖ్యలో అటువైపు కదిలారు. ఈలోపే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఇంటి వద్దకు చేరుకుని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

మొత్తానికైతే తాడిపత్రిలో ఓ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే పెద్దారెడ్డి టార్గెట్‌గా జేసీ అనుంచారులు నెగిటివ్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాడిపత్రిలో ఈ రగడ జరిగినట్లు తెలుస్తోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో తాడిపత్రిలో ఇంకెంత రచ్చ జరుగుతుందో.




టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ.. ఆమె ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>