PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news7dc9a380-c734-4fe9-be3f-5adcddedc0a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news7dc9a380-c734-4fe9-be3f-5adcddedc0a0-415x250-IndiaHerald.jpg..తెలంగాణ లో టి‌పి‌సి‌సి అద్యక్ష పదవిపై తీవ్ర చర్చ కొనసాగుతూనే ఉంది.కాంగ్రెస్ అధిష్టానం పెద్దలంతా ఈ పదవి పై ముమ్మర కసరత్తులు జరుపుతున్నారు. అయితే ఎట్టకేలకు తెలంగాణ పీసీసీ అధ్యక్ష నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టే తెలుస్తుంది.జి‌హెచ్‌ఎం‌సి ఇన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత టి‌పి‌సి‌సి అద్యక్ష‌ పదవికి ఉత్తమ్‌కుమార్‌ రాజీనామా చేశారు.దీంతో తెలంగాణ టి‌పి‌సి‌సి అద్యక్ష పదవికి పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పోటీలో ఉనట్లు తెలుస్తుంది.latest news;revanth;telangana;congress;రాజీనామా;tpcc;letter;partyటి‌పి‌సి‌సి చైర్మెన్ గా రేవంత్ దాదాపుగా ఖాయమేనా.. ??టి‌పి‌సి‌సి చైర్మెన్ గా రేవంత్ దాదాపుగా ఖాయమేనా.. ??latest news;revanth;telangana;congress;రాజీనామా;tpcc;letter;partyFri, 25 Dec 2020 09:00:00 GMTతెలంగాణ లో టి‌పి‌సి‌సి అద్యక్ష పదవిపై తీవ్ర చర్చ కొనసాగుతూనే ఉంది.కాంగ్రెస్ అధిష్టానం పెద్దలంతా ఈ పదవి పై ముమ్మర కసరత్తులు జరుపుతున్నారు. అయితే ఎట్టకేలకు తెలంగాణ పీసీసీ అధ్యక్ష నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టే తెలుస్తుంది.జి‌హెచ్‌ఎం‌సి  ఇన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత టి‌పి‌సి‌సి అద్యక్ష‌ పదవికి ఉత్తమ్‌కుమార్‌ రాజీనామా చేశారు.దీంతో తెలంగాణ టి‌పి‌సి‌సి అద్యక్ష పదవికి పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పోటీలో ఉనట్లు తెలుస్తుంది.అయితే కాంగ్రెస్ అధిష్టానం కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసింది. కాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు ఎవరనే దానిపై ఉత్కంఠ మరికొద్ది రోజులు సాగనుంది.

కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో సుమారు 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌ల బృందం అధిష్టానానికి తమ నివేదికను సమర్పించింది.ఇదిలా ఉండగా  టీపీసీసీ కొత్త సారథిగా రేవంతరెడ్డిని నియమించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తుంది.162 నేతల అభిప్రాయాలలో  మెజారిటీ నేతలు ఆయన పేరునే ప్రతిపాదించారని సమాచారం. దీంతో టీపీసీసీ కొత్త చీఫ్‌గా రేవంత్‌రెడ్డికే పార్టీ అధిష్ఠానం ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రజాకర్షక నేత కావడం, అభిప్రాయ సేకరణలో మెజారిటీ నేతలు రేవంత్‌నే ప్రతిపాదించడం, క్షేత్రస్థాయి నుంచి అధిష్ఠా నం తెప్పించుకున్న సమాచారం ఆయనకే అనుకూలం గా ఉండడం.. తదితర కారణాల నేపథ్యంలో ఈ నిర్ణ యం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో మిగతా సీనియర్ నేతలు అసంతృప్తికి లోను కాకుండా వారికి ప్రాధా న్యం ఇవ్వాలని పార్టీ అధిష్టానం బావిస్తున్నట్టు తెలుస్తుంది. చివరి వరకూ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా చోటు కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఉత్తమ్‌ను ఏఐసీసీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది.ఎన్నో రోజులుగా ఉత్కంఠ రేపుతున్న టి‌పి‌సి‌సి అద్యక్షుడు ఎవరన్నది మరో రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 


చికెన్ బిర్యానీ తెగ తినేశారు

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>