MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlafa866c57-09e4-41b8-960b-6848cbbddd3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlafa866c57-09e4-41b8-960b-6848cbbddd3e-415x250-IndiaHerald.jpgవైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకులకు కొదవ లేదు. తమదైన శైలిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడే వారిలో రోజా కూడా ఒకరు. టీడీపీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టిన రోజా తొలిసారి 2004 ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా కూడా పార్టీ కోసం కష్టపడి, అప్పటి అధికార కాంగ్రెస్‌పై పోరాటాలు చేసి ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఎదిగారు. అదే క్రమంలో 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో టీడీపీలో రోజా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. పైగా చంద్రబాబు తనకు కావాలనే ఓడిపోయేysrcp mla;jeevitha rajaseskhar;roja;jagan;2019;government;mla;minister;air;cheque;tdp;ycp;kusuma jagadish;chandragiri;nagari;party;mantraహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రోజా అడ్డాలో టీడీపీ చేతులెత్తేసినట్లేనా..హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రోజా అడ్డాలో టీడీపీ చేతులెత్తేసినట్లేనా..ysrcp mla;jeevitha rajaseskhar;roja;jagan;2019;government;mla;minister;air;cheque;tdp;ycp;kusuma jagadish;chandragiri;nagari;party;mantraFri, 25 Dec 2020 05:00:00 GMTరోజా కూడా ఒకరు. టీడీపీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టిన రోజా తొలిసారి 2004 ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా కూడా పార్టీ కోసం కష్టపడి, అప్పటి అధికార కాంగ్రెస్‌పై పోరాటాలు చేసి ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఎదిగారు. అదే క్రమంలో 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.   దీంతో టీడీపీలో రోజా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. పైగా చంద్రబాబు తనకు కావాలనే ఓడిపోయే సీటు ఇచ్చారని చెబుతూ రోజా, టీడీపీకి దూరమయ్యారు. జగన్ వైఎస్సార్‌సీపీ పెట్టడంతో ఆమె అందులోకి వెళ్లిపోయారు. ఇక 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరుపున నగరి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై కేవలం 858 ఓట్ల తేడాతో గెలిచి, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.  

అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూనే, చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరోసారి నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఈసారి గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్‌పై 2,708 ఓట్ల తేడాతో గెలిచారు. పైగా వైఎస్సార్‌సీపీ కూడా అధికారంలోకి రావడంతో, రోజా దూసుకెళుతున్నారు. అటు నగరిలో పనులు చేసుకుంటూనే, ఇటు ప్రతిపక్ష టీడీపీపై విరుచుపడుతూ ఉన్నారు.  నగరిలోనే సమస్యలని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నారు. కొత్తగా సి‌సి రోడ్లు, అండర్ డ్రైనేజ్, సచివాలయాలు, బస్ షెల్టర్‌ల నిర్మాణాలు చేపట్టారు. అటు నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు.

అలాగే ప్రభుత్వ పథకాలు ఎలాంటి లోటు లేకుండా అందిస్తున్నారు. అయితే పనితీరు పరంగా అంతా బాగానే ఉన్నా, రోజాకు సొంతపోరుతోనే ఎక్కువ తలనొప్పి ఎదురవుతుంది. నగరిలో జిల్లాకు చెందిన మంత్రులు పెత్తనం చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఓ సీనియర్ నేత అండతో మాజీ మంత్రి చెంగారెడ్డి సోదరుడు కుమారుడు చక్రపాణిరెడ్డి నగరిలో కాస్త హడావిడి చేస్తున్నారని టాక్.

ఇక ఇక్కడ టీడీపీ తరుపున గాలి భాను ప్రకాష్ యాక్టివ్‌గానే పనిచేసుకుంటున్నారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు. అయితే భాను ప్రకాష్‌కు కూడా ఇంటి పోరు ఎక్కువగానే ఉంది. భాను ప్రకాష్‌కు సోదరుడు గాలి జగదీష్ చెక్ పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే నగరి రోజా అడ్డాగా మారిపోయిందనే చెప్పొచ్చు. ఇక్కడ వైసీపీ బలంగానే ఉంది.




టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ.. ఆమె ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>