Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi5828f084-91c0-4791-88df-8edef70ea80d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi5828f084-91c0-4791-88df-8edef70ea80d-415x250-IndiaHerald.jpgరైతులకు భరోసా అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ప్రస్తుతం రైతులకు డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన నగదు ఆలస్యమైంది. పీఎం కిసాన్ పథకం కింద నేడు దేశ వ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి రూ.2వేల చొప్పున మొత్తం రూ.18,000 కోట్లు జమ అవుతాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అర్హులైన రైతుల ఖాతాలలోకి ఈ నగదు జమ కానుంది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ఏడాదికి మూడు దఫాల్లో డబ్బు జమ చేస్తోంది. ఇలా మూడుసార్లూ కలిపి మొత్modi;modi;jayanthi;tara;christmas;mandula;narendra modi;bank;prime minister;december;minister;good news;central government;good newwz;narendra;jayamకేంద్రం గుడ్ న్యూస్ ...మీ ఖాతాల్లో 2000 రూపాయలు పడ్డాయా ...!?కేంద్రం గుడ్ న్యూస్ ...మీ ఖాతాల్లో 2000 రూపాయలు పడ్డాయా ...!?modi;modi;jayanthi;tara;christmas;mandula;narendra modi;bank;prime minister;december;minister;good news;central government;good newwz;narendra;jayamFri, 25 Dec 2020 13:00:00 GMTడిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన నగదు ఆలస్యమైంది. పీఎం కిసాన్ పథకం కింద నేడు దేశ వ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి రూ.2వేల చొప్పున మొత్తం రూ.18,000 కోట్లు జమ అవుతాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  చేతుల మీదుగా అర్హులైన రైతుల ఖాతాలలోకి ఈ నగదు జమ కానుంది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ఏడాదికి మూడు దఫాల్లో డబ్బు జమ చేస్తోంది. ఇలా మూడుసార్లూ కలిపి మొత్తం సంవత్సరానికి .6,000 జమ చేస్తోంది. ఈ పథకం ప్రారంభించాక... ఏడో విడత నిధులను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఈ నిధుల ద్వారా రైతులు... పంటలకు విత్తనాలు, పురుగు మందులూ కొనుక్కోగలరు. ఈ డబ్బు కోసం రైతులు... ఏ ప్రభుత్వ కార్యాలయానికీ వెళ్లాల్సిన పనిలేదు. డైరక్టుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకే మనీ జమ అవుతుంది. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకొని... వ్యవసాయం చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది .

 సాధారణంగా ఆర్థిక సాయం ఏదైనా ఉంటే లబ్ధిదారులకు సాధ్యమైనంత త్వరగా అంటే నెల తొలివారం రోజుల్లో లేకపోతే సగం నెల పూర్తి అవకముందే నిధులు లబ్ధిదారులకు అందుతాయి. ప్రస్తుతం రైతులు ఆందోళన కొనసాగించడంతో ఈ దఫా ఇన్‌స్టాల్‌మెంట్ చాలా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25న మధ్యాహ్నం రైతుల ఖాతాల్లో రూ.2000 నగదు జమ అవుతుంది ,.క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాలతో పాటు భారతరత్న, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి కూడా కావడం వల్ల ఈ నెల 25వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నరేంద్ర మోడీ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

.ఒకవంక మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా ఉత్తరాది రైతులు దేశ రాజధానిని ముట్టడించిన ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీ.. మరో విడత కిసాన్ సమ్మాన్ నిధుల మొత్తాన్ని విడుదల చేయబోతోండటం ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రైతులను ఉద్దేశించి.. ప్రధాని ఏం మాట్లాడుతారు? ఎలాంటి సందేశాన్ని వినిపిస్తారనేది చర్చనీయాంశమౌతోంది.


ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..

మెగా హీరోతో రొమాన్స్‌కు రెడీ అంటున్న బాలీవుడ్ బ్యూటీ!

ఆ ‘మెగా’ సినిమాలో సమంత వద్దనుకున్నారట

జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్!

ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్..

అనుచరులతో పాటుగా కాషాయ ఖండువా కప్పుకున్న ప్రముఖ వ్యాపారవేత్త!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>