Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastrar499564f4-b4e5-45c6-8288-ac27947386a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastrar499564f4-b4e5-45c6-8288-ac27947386a7-415x250-IndiaHerald.jpg టాలీవుడ్‌లో ప్రస్తుతం బ్యాగ్రౌండ్ వాయిస్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఇద్దరు హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ఒకరికొకరు గాత్రదానం చేసుకుని సూపర్ హిట్ అనిపించారు. అందులోనూ రామ్ చరణ్ వాయిస్ తో వచ్చిన ‘రామరాజు ఫర్ భీం’ ట్రైలర్‌కు...megastrar;chiranjeevi;ram charan teja;editor mohan;jr ntr;mithra;ram pothineni;india;tollywood;rrr movie;cinema;writer;king;industry;doctor;king 1;allu sneha;father;chitramఫ్రెండ్ సినిమాకు మెగాస్టార్ బ్యాగ్రౌండ్ ఓవర్!ఫ్రెండ్ సినిమాకు మెగాస్టార్ బ్యాగ్రౌండ్ ఓవర్!megastrar;chiranjeevi;ram charan teja;editor mohan;jr ntr;mithra;ram pothineni;india;tollywood;rrr movie;cinema;writer;king;industry;doctor;king 1;allu sneha;father;chitramFri, 25 Dec 2020 15:00:17 GMTఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్‌లో ప్రస్తుతం బ్యాగ్రౌండ్ వాయిస్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో ఇద్దరు హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ఒకరికొకరు గాత్రదానం చేసుకుని సూపర్ హిట్ అనిపించారు. అందులోనూ రామ్ చరణ్ వాయిస్ తో వచ్చిన ‘రామరాజు ఫర్ భీం’ ట్రైలర్‌కు అద్భుత స్పందన వచ్చింది. కొడుకు వంతు అయిపోయింద. ఇక ఇప్పుడు తండ్రి వంతు వచ్చింది. అవునండీ.. మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాకు బ్యాగ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. అయితే అది ఆర్ఆర్ఆర్ కోసం కాదు లేండి. తన చిరకాల స్నేహితుడు మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా కోసం.

మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి మంచి మిత్రులన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ స్నేహంతోనే మోహన్ బాబు తాజాగా చిరంజీవిని ఆచార్య సెట్‌లో కలిశారట. తన సినిమాకు బ్యాగ్రౌండ్ వాయిస్ ఇవ్వాలని కోరారట. దానికి మెగాస్టార్ కూడా ఒప్పుకున్నారట. దీంతో సన్ ఆఫ్ ఇండియా ఇంట్రడక్షన్ సీన్లకు మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారనే టాక్ ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తోంది. దీంతో మోహన్ బాబు అభిమానులతో పాటు మెగాస్టార్ అభిమానులు కూడా తెగ ఆనందపడిపోతున్నారు.  

చరణ్ వాయిస్ ఓవర్‌కు వచ్చిన రెస్పాన్స్‌కు మించి మెగాస్టార్ వాయిస్ ఓవర్‌కు రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. మెగాస్టార్ గాత్రదానం చేయడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా గుంటూరోడు, ఘాజీ వంటి సినిమాలకు చిరు వాయిస్ ఓవర్ అందించారు. ఇక ఇప్పుడు తన ఫ్రెండ్ కోసం అందించేందుకు రెడీ అయ్యారు. మీరి ఇది ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే  టాలీవుడ్ కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు కథానాయకుడిగా ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే దేశ భక్తి చిత్రం తెరకెక్కుతున్న విషయ తెలిసిందే. ఈ చిత్రానికి మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు సొంత బ్యానర్ లక్ష్మీప్రసన్న ఫిలిమ్స్ అండ్ 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే చాలా ఏళ్ళ తర్వాత మోహన్ బాబు హీరోగా రావడం, అందులోనూ ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తుండడం ఆయన అభిమానులకు చాలా సంతోషం కలిగిస్తోంది.

అంతేకాదు.. ఈ స్థాయి పవర్ ఫుల్ పాత్రలో మోహన్ బాబు ఇంతవరకు ఎన్నడూ నటించలేదని, ఈ చిత్రం తరువాత ఆయనకు చిరకాలం గుర్తుండిపోయే పాత్రగా ఇది నిలిచిపోతుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సన్ ఆఫ్ ఇండియా.. రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ఈ మధ్యనే ప్రారంభమైంది.


మంచు మనోజ్ డెడికేషన్ కి హాట్స్ ఆఫ్...!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్

దొంగతనాలు చేస్తున్న మంత్రిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

వినియోగదార్లకు టెస్లా క్రిస్మస్ గిఫ్ట్.. అబ్బో భలే ఉందిగా!

ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>