HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona-telangana8148c414-5547-4129-b3af-7ca29ae79b81-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona-telangana8148c414-5547-4129-b3af-7ca29ae79b81-415x250-IndiaHerald.jpgకోవిడ్ లక్షణాలతో పాటు మరో ఏడు లక్షణాలు కొత్తరకం స్ట్రెయిన్ సోకినవారికి ఉంటాయని ‘నేషనల్ హెల్త్ సర్వీసెస్’ తెలిపింది. జన్యుమార్పిడి చెందిన కొత్తరకం కరోనా ‘VUI 202012/01’ స్పైక్ ప్రొటీన్ శరీరంలోని కణజాలానికి సులభంగా అంటుకుని వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధకులు పేర్కొంటున్నారు.కొత్త రకం కరోనా సాధారణంగా జ్వరం, పొడి దగ్గు, వాసన కోల్పోవడంతోపాటు ఇతర ఏడు లక్షణాలు ఉంటాయని తెలిపారు. అలసట, ఆకలి మందగించడం, తలనొప్పి, విరోచనాలు (డయోరియా), మానసిక గందరగోళం, కండరాల నొప్పులు దీనికి సంకేతమని పేర్కొన్నారు.corona;health;jaan;director;protein;john;coronavirusకొత్తరకం కరోనా స్ట్రెయిన్ కు పాత లక్షణాలతో పాటు మరో ఏడు లక్షణాలు!కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కు పాత లక్షణాలతో పాటు మరో ఏడు లక్షణాలు!corona;health;jaan;director;protein;john;coronavirusFri, 25 Dec 2020 09:05:00 GMTగడిచిన ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలు.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతుండగా కరోనా వైరస్ మహమ్మారి కొత్తరూపం సంతరించుకోవడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బ్రిటన్ లో ఒక రేంజ్ లో విజృంభిస్తున్న కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్... ప్రపంచ దేశాల ప్రజలను మరింత కలవరానికి గురిచేస్తోంది. ఈ కొత్తరకం స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తితో కోవిడ్-19కు టీకా వచ్చిందనే ఆనందం ఆవిరవుతోంది. ప్రస్తుతం కోవిడ్ లక్షణాలతో పాటు అదనంగా మరో ఏడు లక్షణాలు కొత్తరకం స్ట్రెయిన్ సోకినవారికి ఉంటాయని ‘నేషనల్ హెల్త్ సర్వీసెస్’ తెలిపింది. జన్యుమార్పిడి చెందిన కొత్తరకం కరోనా ‘VUI 202012/01’ స్పైక్ ప్రొటీన్ శరీరంలోని కణజాలానికి సులభంగా అంటుకుని వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో గుర్తించిన వేరియంట్‌లో కరోనా వైరస్ కుటుంబానికి ఆ రూపాన్ని ఇచ్చే స్పైక్ ప్రొటీన్ సహా వైరస్ ఆకారాన్ని ప్రభావితం చేసే 17 ఉత్పరివర్తనాలు ఉన్నాయి. దీని గురించి లోతైన అధ్యయనం నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు.. కొత్తరకం స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఇదే కారణమని పేర్కొన్నారు.
 




కొత్త రకం కరోనా సాధారణంగా జ్వరం, పొడి దగ్గు, వాసన కోల్పోవడంతోపాటు ఇతర ఏడు లక్షణాలు ఉంటాయని తెలిపారు. అలసట, ఆకలి మందగించడం, తలనొప్పి, విరోచనాలు (డయోరియా), మానసిక గందరగోళం, కండరాల నొప్పులు దీనికి సంకేతమని పేర్కొన్నారు. మరోవైపు, నైజీరియాలోనూ మరో కొత్తరకం కరోనాను గుర్తించారు. ఈ విషయాన్ని ఆఫ్రికా అంటువ్యాధుల నియంత్రణ విభాగం ప్రకటించింది. నైజీరియాలో గుర్తించిన కొత్తరకం స్ట్రెయిన్.. బ్రిటన్, దక్షిణాఫ్రికాల జాతికి భిన్నమైందని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ జాన్ కెంగ్‌సాంగ్ పేర్కొన్నారు. నైజీరియాలో గుర్తించిన జన్యువు ఇంకా చాలా పరిమిత డేటాపై ఆధారపడి ఉందని, ఇది 501 మ్యుటేషన్ చెందిన రకమని ఆయన వ్యాఖ్యానించారు. డిసెంబరు 18న దక్షిణాఫ్రికాలో గుర్తించిన స్ట్రెయిన్ 501.వీ2‌గా పేర్కొన్నారు.




మహేష్ ,పవన్ లను వెనక్కి నెట్టేసిన ఆ క్రేజీ హీరో ఎవరు...!?

ఈ రోజుతో జగన్ సూపర్ హిట్టే ?

చికెన్ బిర్యానీ తెగ తినేశారు

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>