MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/sardar-paparayudu-movied5e0a8c1-c774-4bd8-a091-2ae10fefde31-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/sardar-paparayudu-movied5e0a8c1-c774-4bd8-a091-2ae10fefde31-415x250-IndiaHerald.jpgనందమూరి తారక రామారావు. తెలుగు తెర ఇలా వేల్పు ఆయన. సాంఘీక, సాంస్కృతిక, పౌరాణిక, ఇతిహాస చిత్రాలతో ఆయన లెక్క లేనన్ని అద్భుత విజయాలను అందుకున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చెక్కు చెదరని అభిమానాన్ని సంపాదించుకున్నారుsardar paparayudu movie;ntr;kumaar;dasari narayana rao;kranthi;kranthi kumar;kranti;tiru;cinema;telugu;kanna lakshminarayana;temper;nandamuri taraka rama rao9 నెలల్లో సీఎం అవ్వాల్సిన ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా సంగతులు తెలిస్తే అస్సలు నమ్మరు9 నెలల్లో సీఎం అవ్వాల్సిన ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా సంగతులు తెలిస్తే అస్సలు నమ్మరుsardar paparayudu movie;ntr;kumaar;dasari narayana rao;kranthi;kranthi kumar;kranti;tiru;cinema;telugu;kanna lakshminarayana;temper;nandamuri taraka rama raoFri, 25 Dec 2020 10:00:00 GMTనందమూరి తారక రామారావు. తెలుగు తెర ఇలా వేల్పు ఆయన. సాంఘీక, సాంస్కృతిక, పౌరాణిక,  ఇతిహాస చిత్రాలతో ఆయన లెక్క లేనన్ని అద్భుత విజయాలను అందుకున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చెక్కు చెదరని అభిమానాన్ని సంపాదించుకున్నారు. కానీ.., సీనియర్ యన్టీఆర్ సూపర్ హిట్ చిత్రాలలో 'సర్దార్ పాపారాయుడు' చిత్రానికి మాత్రం ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. పెద్దాయన నట విశ్వరూపాన్ని బయటికి తీసింది సర్దార్ పాపారాయుడు. ఇప్పుడు ఆ మూవీ విడుదలై సరిగ్గా 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సర్దార్ పాపారాయుడు విశేషాలు తెలుసుకుందాం. ఎన్టీఆర్, దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్‌ కి అప్పట్లో తిరుగు ఉండేది కాదు. అలా.. వీరి కాంబోలోనే ‘సర్ధార్ పాపారాయుడు’ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇది వారికీ హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. కథ రీత్యా యన్టీఆర్ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. తండ్రిగా, కొడుకుగా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.

రూ. 30 లక్షల వ్యయంతో ఈ మూవీ టోటల్ రన్ లో  రూ. 2 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఒక వృద్ద పాత్ర, ఒక యువకుని పాత్రతో డ్యూయల్ రోల్ క్రియేట్ చేసి , దాన్ని ఒక ఫార్ములాగా మార్చిన చిత్రమిది. నిన్న మొన్నటి వరకు కూడా కమర్షియల్ తెలుగు సినిమా ఇలాంటి కథల చుట్టే తిరగడం విశేషం. దర్శకుడిగా అద్భుత విజయాలను అందుకున్న  క్రాంతి కుమార్ సర్దార్ పాపారాయుడు చిత్రానికి  కథా సహాకారం అందించడం విశేషం. కానీ.., మీకు తెలుసా ముందుగా ఈ చిత్రానికి కేవలం పాపారాయుడు అని మాత్రమే పేరు పెట్టారు. అయితే .., సీనియర్ యన్టీఆర్ ఆ టైటిల్ లో ఫోర్స్ లేదని పెదవి విరిచారట. దీనితో.., తరువాత  సర్దార్ యాడ్ చేశారు. ఇక ఈ సినిమాలో ప్రతి పాట ఒక ఆణిముత్యమే. ముఖ్యంగా హల్లో టెంపర్, ఉయ్యాలకు వయసొచ్చింది, తెల్లచీర కళ్ల కాటుక, 1980 వరకు పాటలతో పాటు వినరా భారత వీర కుమార వంటి పాటలు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాయి. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే యన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. తరువాత 9 నెలల్లోనే ఆయన సీఎం అయ్యారు.  అప్పటికే ఎన్టీఆర్ 60 ఏళ్ళ వయసులో రాజీకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సమయంలో తన కన్నా పాతికేళ్ళు చిన్నదైనా శ్రీదేవితో చిందులు వేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.


దీదీకి సవాల్ కానున్న లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీల కూటమి!

'అమ్మ ఒడి' పధకం అనర్హుల జాబితా సవరణ సచివాలయ సిబ్బంది చేతుల్లోనే!

వైభవంగా ముక్కోటి ఏకాదశి

ఈ రోజుతో జగన్ సూపర్ హిట్టే ?

చికెన్ బిర్యానీ తెగ తినేశారు

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>