PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/somu336d1482-5e8a-4eba-bcbc-3b1e00564f99-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/somu336d1482-5e8a-4eba-bcbc-3b1e00564f99-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో త్వరలో అధికారంలోకి రావడానికి బీజేపీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది.. దానికి తగ్గ కష్టం కూడా పడుతుంది.. అయితే ఎటొచ్చి వైసీపీ కి బ్యాడ్ నేమ్ రావడం ఎలా అనేదే అసలు ప్రశ్న.. ఇప్పటికే టీడీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేశారు ప్రజలు.. మళ్ళీ టీడీపీ నేతలు ఓట్లు అడగడానికి రాకుండా చేశారు.. దాంతో ఇక్కడ బీజేపీ లాంటి పార్టీ రెండో స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. దాన్ని బీజేపీ భర్తీ చేస్తుందని అంటున్నారు.. నిజానికి బీజేపీ పార్టీ ఇప్పటికిప్పుడు ప్రజలు అధికారం ఇస్తే చేపట్టే ఆలోచనలో ఉంది.. అsomu;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;tdp;success;central government;ycp;janasena party;dookudu;partyసెంట్రల్ లోనే సోము ని దూకుడు తగ్గించామన్నారా..?సెంట్రల్ లోనే సోము ని దూకుడు తగ్గించామన్నారా..?somu;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;tdp;success;central government;ycp;janasena party;dookudu;partyFri, 25 Dec 2020 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో త్వరలో అధికారంలోకి రావడానికి బీజేపీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది.. దానికి తగ్గ కష్టం కూడా పడుతుంది.. అయితే ఎటొచ్చి వైసీపీ కి బ్యాడ్ నేమ్ రావడం ఎలా అనేదే అసలు ప్రశ్న.. ఇప్పటికే టీడీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేశారు ప్రజలు.. మళ్ళీ టీడీపీ నేతలు ఓట్లు అడగడానికి రాకుండా చేశారు.. దాంతో ఇక్కడ బీజేపీ లాంటి పార్టీ రెండో స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. దాన్ని బీజేపీ భర్తీ చేస్తుందని అంటున్నారు.. నిజానికి బీజేపీ పార్టీ ఇప్పటికిప్పుడు ప్రజలు అధికారం ఇస్తే చేపట్టే ఆలోచనలో ఉంది.. అయితే వెనుకా ముందు చూసుకుకోకుండా ఎలా బీజేపీ అధికారాన్ని చేపడుతుందన్నదే ప్రశ్న..

వాస్తవానికి గతంలో లేనంత దూకుడుగా ప్రజల్లో ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది. సోము వీర్రాజు ప్రజల్లోకి పార్టీ ని తీసుకెళ్లడం లో చాలా వరకు సక్సెస్ అయ్యారు.. అందుకే ఆయనను ముద్దుగా షార్ప్ షూటర్ అని పిలుస్తున్నారు బీజేపీ నాయకులూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌పై ఉన్న బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం.. ఆదిశ‌గా కావాల్సిన కార్యాచ‌ర‌ణ‌ను త‌న‌దైన శైలిలో అమ‌లు చేస్తోంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న నాయ‌కుల‌ను బీజేపీ సార‌థులుగా నియమించింది. దీంతో పాటు స‌ద‌రు నాయ‌కులకు వాగ్ధాటి కూడా ఉండ‌డం పార్టీకి క‌లిసి వ‌చ్చే ప‌రిణామం. అయితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏమైనా చేయమని సోము కి కేంద్ర ప్రభుత్వం అధికారాలు ఇచ్చిందట.. అందుకే తగ్గట్లే  ఎవ‌రిపై అయినా విమ‌ర్శలు చేయ‌డంలో వీర్రాజుకు ఏ మాత్రం మొహ‌మాటం ఉండ‌దు అన్న సంగతి తెలిసిందే..

అయితే ఇది మొదట్లో ఇప్పుడు హై కమాండ్ సోము ను కంట్రోల్ ఉండమని చెప్పిందట.వీర్రాజు అధ్యక్షుడైన దగ్గర నుండి జనసేనను కానీ దాని అధినేత పవన్ కల్యాణ్ ను కూడా ఏ విషయంలో కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోవటం లేదు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని దాదాపు మూడు నెలల క్రితమే ప్రకటించేశారు. వీర్రాజు ఏకపక్షంగా చేసిన ఈ ప్రకటనను అప్పట్లో జనసేన పట్టించుకోలేదు. ఎందుకంటే ఉపఎన్నికలో తమపార్టీయే పోటీ చేయాలని పవన్ గట్టి పట్టుదలగా ఉన్నారు. అందుకనే చాపకింద నీరులాగ తన ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టే వీర్రాజు ప్రకటనకు పెద్దగా విలువ్వలేదు. అయితే ఈమధ్యనే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నుండి జనసేన అభ్యర్ధులను బీజేపీ నేతలు విత్ డ్రా చేయించారు. అప్పటి నుండి తిరుపతి ఉపఎన్నికలో పోటీ విషయంలో పవన్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తిరుపతిలో జరిగిన బీజేపీ రెండు రోజుల కార్యవర్గ సమావేశంలో వీర్రాజు మాట్లాడుతూ బీజేపీనే పోటీ చేస్తుందని ప్రకటించేశారు.





జ‌గ‌న్ గెలిచాడు.. ఎన్నిక‌లు కాదు.. మ‌న‌సులు..!

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>