PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mayorfortwentyoneyearsfirstinindia4eec3a26-3d35-4c82-b410-fd160f483df1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mayorfortwentyoneyearsfirstinindia4eec3a26-3d35-4c82-b410-fd160f483df1-415x250-IndiaHerald.jpgఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫంట్‌ (ఎల్డీఎఫ్‌) విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 941 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ 516పైగా స్థానాల్లో విజయకేతనం ఎగరేసి పూర్తి ఆధిక్యతను కనబర్చింది. కేరళ రాష్ట్ర రాజధాని తరువనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో 21 ఏళ్ల ఆర్యా రాజేంద్రన్‌ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్శించారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. aryarajendran;arya;tiru;kerala;india;capital;local language;aryaa;party21 ఏళ్లకే మేయర్21 ఏళ్లకే మేయర్aryarajendran;arya;tiru;kerala;india;capital;local language;aryaa;partyFri, 25 Dec 2020 20:09:51 GMT21 ఏళ్లకే మేయర్
దేశంలోనే తొలిసారి 
ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫంట్‌ (ఎల్డీఎఫ్‌) విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 941 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ 516పైగా స్థానాల్లో విజయకేతనం ఎగరేసి పూర్తి ఆధిక్యతను కనబర్చింది. కేరళ రాష్ట్ర రాజధాని తరువనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో 21 ఏళ్ల ఆర్యా రాజేంద్రన్‌ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్శించారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. విపక్ష కూటమి నుంచి సీనియర్‌ అభ్యర్థి బరిలో నిలిచినప్పటికీ అనూహ్యంగా ఆమె మేయర్‌ అభ్యర్థిగా ఖరారు అయ్యారు. తిరువనంతపురం మేయర్‌ అభ్యర్థిగా ఆర్యా రాజేంద్రన్‌ను ఎంపిక చేస్తున్నట్లు ఎల్డీఎఫ్‌ పెద్దలు ప్రకటించారు. దీంతో దేశంలో అతిపిన్న వయసులో మేయర్‌ పీఠం అధిరోహించిన యువతిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. స్థానిక ఎల్‌బీఎస్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్నారు. అంతేకాకుండా  స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ వ్యవహారాల్లోనూ ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో విజయంపై ఆమె స్పందిస్తూ... రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతఙత చెప్పారు. అతి చిన్న వయసులో మేయర్ కావడంపై పలువురు ఆమెను అభినందించారు.     


జ‌గ‌న్ గెలిచాడు.. ఎన్నిక‌లు కాదు.. మ‌న‌సులు..!

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>