PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaaj191d99c1-4cdf-477c-a3bb-c2dee0793059-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaaj191d99c1-4cdf-477c-a3bb-c2dee0793059-415x250-IndiaHerald.jpgఅటల్ బిహారీ వాజ్ పేయి జయంతి ఈ రోజు. ఆయన రెండేళ్ళ క్రితం ఈ లోకాన్ని వీడారు. అసలైన భారత రత్నగా ఈ దేశంలో వెలిగారు. వాజ్ పేయ్ బహుముఖీయమైన ప్రతిభాశాలి అనడంలో సందేహమూ లేదు, అతిశయోక్తీ లేదు. వాజ్ పేయ్ తొంబై మూడేళ్ళ పాటు జీవించి అటు జీవితంలోనూ ఇటు రాజకీయాల్లోనూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ధీరోధాత్తుడు. vaaj;jayanthi;jeevitha rajaseskhar;kirti;prakruti;india;prime minister;parliment;yuva;jayamనెహ్రూ జోస్యం నిజం చేసిన వాజ్ పేయ్నెహ్రూ జోస్యం నిజం చేసిన వాజ్ పేయ్vaaj;jayanthi;jeevitha rajaseskhar;kirti;prakruti;india;prime minister;parliment;yuva;jayamFri, 25 Dec 2020 10:30:00 GMTజయంతి ఈ రోజు. ఆయన రెండేళ్ళ క్రితం ఈ లోకాన్ని వీడారు. అసలైన భారత రత్నగా ఈ దేశంలో వెలిగారు. వాజ్ పేయ్ బహుముఖీయమైన ప్రతిభాశాలి అనడంలో సందేహమూ లేదు, అతిశయోక్తీ లేదు. వాజ్ పేయ్ తొంబై మూడేళ్ళ పాటు జీవించి అటు జీవితంలోనూ ఇటు రాజకీయాల్లోనూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ధీరోధాత్తుడు.

వాజ్ పేయ్ లో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆయనలో ప్రేమికుడు కూడా ఉన్నాడు. అలాగే ఆయనలో ప్రకృతి ప్రేమికుడు అంతకంటే ప్రజలను ప్రేమించే నాయకుడూ ఉన్నారు. వాజ్ పేయ్ ఆరున్నరేళ్ళ పాటు ఈ దేశాన్ని పాలించారు. నాడు వాజ్ పేయ్ ఒక్క ఓటు తేడాతో పార్లమెంట్ లో ప్రభుత్వాని త్యాగం చేస్తే ప్రజలు మరింత ఎక్కువ మద్దతు ఇచ్చి 1999 ఎన్నికల్లో గెలిపించారు. దటీజ్ వాజ్ పేయ్ అనేలా ఆయన కీర్తి దిగంతాలకు వ్యాపించింది.

అణు పరీక్షలను దేశంలో తొలిసారి నిర్వహించి భారత్ ని రక్షణపరంగా  మరింత బలోపేతం చేసిన నేతగా కూడా వాజ్ పేయ్ ని భారత జాతి మొత్తం గుర్తు చేసుకుంటుంది. వాజ్ పేయి లో భావుకుడు ఉన్నాడు. కవి కూడా ఉన్నాడు. ఆయన చేత ఎన్నో కవితలను ఆ కవి రాయించాడు.  జీవితంలో తీపీ చేదూ అన్నీ ఉంటాయి. కానీ దాన్ని విడగొట్టుకుని ప్రతీ సెకన్ ని అస్వాదించు, అనుభవించు, ఆందనంగా జీవించు అని గొప్ప సందేశాన్ని వాజ్ పేయి తన కవితల ద్వారా అందించారు.

ఇదిలా ఉంటే 1957లో అంటే రెండవ లోక్ సభకు వాజ్ పేయ్ యువ పాలమెంటేరియన్ గా ఎన్నికయ్యాక నాడు భారత దేశం మొత్తం ఆరాధించే తొలి ప్రధాని పండిట్ నెహ్రూ విధానాల మీద దేశం నాడు ఎదుర్కొంటున్న సమస్యల మీద వాజ్ పేయ్ పార్లమెంట్ లో ప్రస్తావించేవారు. వాజ్ పేయ్ వాగ్దాటికి, ఆయన అనర్గళమైన ఉపన్యాసానికి ఆయన నాయకత్వ లక్షణాలకు ముగ్దుడైన నెహ్రూ ఎప్పటికైనా భారత దేశానికి వాజ్ పేయ్ ప్రధాని అవుతాడంటూ జోస్యం చెప్పారు. అది నిజమైంది. 1996లో తొలిసారిగా వాజ్ పేయ్ ప్రధానిగా ప్రమాణం చేసి నెహ్రూ జోస్యాన్ని నిజం చేశారు.





నూతన సంవత్సరంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేంద్రం!

దీదీకి సవాల్ కానున్న లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీల కూటమి!

తూర్పుతో బోణీ కొట్టబోతున్న జగన్ ?

'అమ్మ ఒడి' పధకం అనర్హుల జాబితా సవరణ సచివాలయ సిబ్బంది చేతుల్లోనే!

వైభవంగా ముక్కోటి ఏకాదశి

ఈ రోజుతో జగన్ సూపర్ హిట్టే ?

చికెన్ బిర్యానీ తెగ తినేశారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>