PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ponnam2c8430c4-84b1-4d1d-81d9-d4bcaccf5c53-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ponnam2c8430c4-84b1-4d1d-81d9-d4bcaccf5c53-415x250-IndiaHerald.jpgఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమం పట్ల సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ రైతు పక్షపాతి అయితే టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేసారు. బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ponnam;kcr;prabhakar;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;huzur nagar;chintamaneni prabhakar;capital;chief minister;tpcc;ponnam prabhakar;minister;central government;nijam;karimnagar;ponnam prabhakar goud;parakala prabhakar;reddy;partyబీజేపీ నాయకులకు దమ్ముంటే ఈ పని చేయాలి... పొన్నం సవాల్బీజేపీ నాయకులకు దమ్ముంటే ఈ పని చేయాలి... పొన్నం సవాల్ponnam;kcr;prabhakar;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;huzur nagar;chintamaneni prabhakar;capital;chief minister;tpcc;ponnam prabhakar;minister;central government;nijam;karimnagar;ponnam prabhakar goud;parakala prabhakar;reddy;partyFri, 25 Dec 2020 19:36:00 GMTసీఎం కేసీఆర్ పై కరీంనగర్ మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మరో సారి విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఢిల్లీలో పొన్నం మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన నిలదీశారు. కేసీఆర్ రైతు పక్షపాతి అయితే ఢిల్లీకి వచ్చి రైతులను ఎందుకు కలవలేదని పొన్నం ప్రశ్నించారు. నిజంగా కేసీఆర్ రైతులకు పక్షపాతి అయితే టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేసారు.

ఢిల్లీకి వచ్చి కేంద్ర ప్రభుత్వ పెద్దల ముందు కేసీఆర్ మొకరిల్లారని పొన్నం ఆరోపించారు. తన అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే కేసీఆర్  ఢిల్లీ పెద్దల ముందు మొరకరిల్లారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ ను ఎందుకు కాపాడుతుందన్న  పొన్నం ప్రభాకర్... ఈడీ, సీబీఐలు ఎందుకు కేసీఆర్ అవినీతిపై విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు గల్లీలో ఒకలాగా ఢిల్లీలో మరోలా వ్యహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు దమ్ము,  ధైర్యం ఉంటే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని పొన్నం సవాల్ విసిరారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచే కుట్రలో భాగంగానే  బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని అన్నారు. . తన సొంత నియోజకవర్గంలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఏం చేస్తున్నారని  ప్రశ్నించిన పొన్నం...  రోహింగ్యాల విషయం ఎన్నికల ముందే గుర్తొచ్చిందా? అని  నిలదీశారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన పార్టీ కాంగ్రెస్  మాత్రమేనని, దుర్గం చెరువు ఫ్లై ఓవర్ ఒక్కటి కట్టి మొత్తం హైదరాబాద్ ను తామే అభివృద్ధి చేసినట్టు టీఆర్ఎస్  నాయకులు గొప్పాలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. 




జ‌గ‌న్ గెలిచాడు.. ఎన్నిక‌లు కాదు.. మ‌న‌సులు..!

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>