Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vikram9de0eac2-2002-4bf0-8887-379d79c282d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vikram9de0eac2-2002-4bf0-8887-379d79c282d4-415x250-IndiaHerald.jpgవెరైటీ గెటప్‌లు.. విభిన్న కథలకు కేరాఫ్ అడ్రస్. విక్రమ్ సినిమా వస్తుందంటే.. తెరపై కొత్త తరహా కథ చూడవచ్చని సగటు సినీ సినీ ప్రేక్షకుడు భావిస్తాడు.మూస కథకు భిన్నంగా సినిమాలు తీసే విక్రమ్.. ఈసారి మరో సరికొత్త మూవీతో మన ముందుకొస్తున్నారు. అదే కోబ్రా. ఇంతకు ముందు డిమాండ్‌ కాలనీ, ఇమైకా నొడిగల్‌ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం కోబ్రా. 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ..ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుvikram;padmapriya;srinidhi shetty;vikram;cinema;tamilnadu;chitramకొత్త అవతారం ఎత్తిన అపరిచితుడు ...!?కొత్త అవతారం ఎత్తిన అపరిచితుడు ...!?vikram;padmapriya;srinidhi shetty;vikram;cinema;tamilnadu;chitramFri, 25 Dec 2020 13:00:00 GMTవిక్రమ్ సినిమా వస్తుందంటే.. తెరపై కొత్త తరహా కథ చూడవచ్చని సగటు సినీ సినీ ప్రేక్షకుడు భావిస్తాడు.మూస కథకు భిన్నంగా సినిమాలు తీసే విక్రమ్..  ఈసారి మరో  సరికొత్త మూవీతో మన ముందుకొస్తున్నారు. అదే కోబ్రా.  ఇంతకు ముందు డిమాండ్‌ కాలనీ, ఇమైకా నొడిగల్‌ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం కోబ్రా. 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ..ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. కాగా, లాక్‌డౌన్‌ తర్వాత మిగిలిన షూటింగ్‌ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.

.ముఖ్యంగా ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రతి  నటుడిగా పరిచయం కాబోతున్నాడు..ఇందులో నటుడు విక్రమ్‌ కనిపించనున్న గెటప్‌ల గురించి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కోబ్రా చిత్రంలో విక్రమ్‌ 20 గెటప్పుల్లో కనిపించనట్లు చిత్రవర్గాలు పేర్కొన్నారు. ఇది సైకలాజికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతున్న కథా చిత్రం కావడంతో హీరోకు ఇన్ని గెటప్‌లు అవసరం అయ్యాయి అంటున్నారు. దీంతో కోబ్రా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా చిత్రంలోని విక్రమ్‌ గెటప్‌లు ఒక్కొక్కటీ వరుసగా విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు చెప్పారు. అందులో భాగంగా ఇటీవల ఒక గెటప్‌ను విడుదల విషయం తెలిసిందే.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చేసింది. కోబ్రాలో విక్రమ్ సెకండ్ లుక్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియో విడుదల చేసింది.

ఆ ఫొటోలో పొడవాటి.. గజిబిజి జట్టుతో కనిపించాడు విక్రమ్. అంతేకాదు ఎన్నో అంకెలు, ఫార్ములాలు అతడి మెదుడులో ఉన్నట్లు చూపించారు. ప్రతి సమస్యకూ గణిత పరిష్కారం ఉంటుందని క్యాప్షన్ పెట్టారు. ఈ కొత్త లుక్ విక్రమ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొన్ని రోజుల క్రితం సినిమా చిత్రీకరణకు ప్రభుత్వాలు అనుమతివ్వడంతో.. కోబ్రా షూటింగ్ మళ్లీ మొదలు పెట్టారు.  తమిళనాడులోనే షూట్ చేస్తున్నారు.అస్లాన్ ఇల్మాజ్ పాత్రలో పఠాన్ కనిపించనున్నాడు. వీరితో పాటు కేఎస్‌ రవికుమార్‌, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు


ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..

మెగా హీరోతో రొమాన్స్‌కు రెడీ అంటున్న బాలీవుడ్ బ్యూటీ!

ఆ ‘మెగా’ సినిమాలో సమంత వద్దనుకున్నారట

జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్!

ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్..

అనుచరులతో పాటుగా కాషాయ ఖండువా కప్పుకున్న ప్రముఖ వ్యాపారవేత్త!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>