MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ramd1010fac-296c-4ef4-9a4f-3647e720829b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ramd1010fac-296c-4ef4-9a4f-3647e720829b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమకు ప్రస్తుతం మంచి కళ వచ్చిందనే చెప్పాలి. వాస్తవానికి కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా భారీగా నష్టాలు చవిచూసింది. ఎన్నో షూటింగ్ దశలో ఉన్న సినిమాలతో పాటు ప్రారంభం కావలసిన సినిమాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఎందరో నిర్మాతలు తమ సినిమాల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఎంతో అవస్థలు పడ్డారు. ram pothineni;solo brathuke so better;ram pothineni;sai dharam tej;tollywood;industries;cinema;media;twitter;hero;cinema tickets;solo bathuke so better;racchaటిక్కెట్స్ బుక్ చేశా .... మడతెట్టడమే మిగిలింది ... కుమ్మేద్దాం రండి .....!!టిక్కెట్స్ బుక్ చేశా .... మడతెట్టడమే మిగిలింది ... కుమ్మేద్దాం రండి .....!!ram pothineni;solo brathuke so better;ram pothineni;sai dharam tej;tollywood;industries;cinema;media;twitter;hero;cinema tickets;solo bathuke so better;racchaFri, 25 Dec 2020 01:00:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమకు ప్రస్తుతం మంచి కళ వచ్చిందనే చెప్పాలి. వాస్తవానికి కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా భారీగా నష్టాలు చవిచూసింది. ఎన్నో షూటింగ్ దశలో ఉన్న సినిమాలతో పాటు ప్రారంభం కావలసిన సినిమాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఎందరో నిర్మాతలు తమ సినిమాల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఎంతో అవస్థలు పడ్డారు.

మరోవైపు చేయడానికి పనులు లేక, తినడానికి సరైన తిండి లేక వేలాదిమంది సినిమా కార్మికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సినిమా పరిశ్రమ వారు ఎందరో ప్రముఖులు తమ దయార్ద్ర హృదయంతో ముందుకు వచ్చి అటువంటి వారికి తమవంతుగా సాయం అందించడం జరిగింది. అయితే ఇటీవల ఎట్టకేలకు షూటింగ్స్ ప్రారంభం అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ సినిమా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని పలువురు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కాగా ఆరోజు కూడా ఫైనల్ గా రావడం, నేడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ కానుండడంతో పలువురు సినిమా ప్రముఖులు అలానే ప్రేక్షకులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సందర్భంగా తొలి సినిమాగా రేపు థియేటర్స్ లోకి మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్ ప్రేక్షకుల ముందుకు రానుండగా పలువురు సినిమా ప్రముఖులు ఆ మూవీ సూపర్ హిట్ కొట్టాలని టీమ్ కి అభినందనలు తెలియ చేస్తున్నారు. ఇక అందులో భాగంగా హీరో రామ్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసారు. ఇప్పుడే సోలో బ్రతుకే సో బెటర్ టికెట్స్ కొన్నాను, అందరం కలిసి థియేటర్స్ లో రచ్చ చేద్దాం రండి అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!
" style="height: 421px;">




తాడిపత్రి రగడ: జేసీ ఫ్యామిలీ టార్గెట్ అదేనా?

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>