PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kidnapc0413640-afa3-46b7-99c3-167ff2126d36-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kidnapc0413640-afa3-46b7-99c3-167ff2126d36-415x250-IndiaHerald.jpgసైబరాబాద్ పోలీసులు మరోసారి సూపర్ ఫాస్ట్ గా వర్క్ చేశారు. కిడ్నాప్ కేసును కేవలం గంటన్నరలోనే చేధించి బాలుడిని సురక్షితంగా రక్షించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కథ కేవలం గంటన్నరలోనే సుఖాంతమైంది. కిడ్నాప్ కు గురయిన బాలుడి ఆచూకిని కనుకున్న పోలీసులు కిడ్నాపర్ నుండి బాలుడిని సురక్షితంగా రక్షించారు. మహిళా కిడ్నపర్ ను అదుపులోకి తీసుకున్నారు. kidnap;gautham new;gautham;rakshita;ramakrishna;srikanth;suman;varsha;huzur nagar;jeedimetla;police;police station;traffic police;local languageగంటన్నరలోనే కిడ్నాప్ కేసు సుఖాంతం!గంటన్నరలోనే కిడ్నాప్ కేసు సుఖాంతం!kidnap;gautham new;gautham;rakshita;ramakrishna;srikanth;suman;varsha;huzur nagar;jeedimetla;police;police station;traffic police;local languageFri, 25 Dec 2020 15:41:50 GMTజీడిమెట్ల పోలీస్ స్టేషన్  పరిధిలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కథ కేవలం గంటన్నరలోనే సుఖాంతమైంది. కిడ్నాప్ కు గురయిన బాలుడి ఆచూకిని కనుకున్న పోలీసులు కిడ్నాపర్ నుండి బాలుడిని సురక్షితంగా రక్షించారు.  మహిళా కిడ్నపర్ ను అదుపులోకి తీసుకున్నారు.


        కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్, సంజయ్ గాంధీనగర్  లో  నివాసం ఉండే  శ్రీకాంత్ కుమారుడు13 నెలల బాలుడిని  గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు వెళ్లారు. కిడ్నాప్ పై ఉదయం12 గంటలకు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు వెంటనే అప్రమత్తమైన  జీడిమెట్ల సీఈ బాలరాజు,  ఎస్ ఐదు మన్మథ్, సుమన్, గౌతమ్ రంగంలోకి దిగారు. సీఐ, ఎస్ ఐలతో పాటు పోలీసు సిబ్బంది కెమెరాల ఆధారంగా కిడ్నాప్ కేసు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. వివిధ కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసు బృందం ముమ్మర గస్తీ నిర్వహించింది. మహిళా కిడ్నపర్  షాపూర్ నగర్ లో నడుచుకుంటూ వెళ్తుండగా పట్టుకొని బాలుడు రామకృష్ణ ను సురక్షితంగా కాపాడారు జీడిమెట్ల పోలీసులు.


     బాలుడిని ఎత్తుకెళ్లింది తానేనని మహిళా  కిడ్నాపర్ తెలపటం తో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్ కు తరలించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే బాలుడిని కిడ్నాప్ ఎందుకు చేసింది, అమ్మడానికా??లేక ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేవలం గంటన్నరలోనే కిడ్నాప్ కేసును చేధించి బాలుడిని రక్షించిన జీడిమెట్ల పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పోలీసుల సేవలను గుర్తించిన పలువురు స్థానిక యువకులు పోలీసు స్టేషన్లో  పెట్రోలింగ్ మొబైల్ సిబ్బందిని, సీఈ బాలరాజు, ఎస్ఐలను అభినందించి, శాలువలు, పులదండలతో సన్మానించారు.




చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

షూటింగ్ కి లేట్ గా వస్తే హీరోయిన్ KR విజయకు ఏకంగా కోర్ట్ లో చుక్కలు చూపించిన ఎన్టీఆర్

ఫ్యామిలీ ''బ్యాక్ గ్రౌండ్"తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్లు!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>