PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/caronab82ab92d-c700-47eb-9bbc-b1dbb08df7a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/caronab82ab92d-c700-47eb-9bbc-b1dbb08df7a3-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనాలో కొత్తరకం అందర్నీ కూడా ఆందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల్లో ఒక రకమైన భయం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన చాలామందిలో వ్యక్తమవుతుంది. మన దేశంలో ఉన్న ప్రభుత్వాలు అన్నీ కూడా ఇప్పుడు దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఇది పుట్టిన బ్రిటన్ నుంచి ఎవరైనా వచ్చారా ఏంటి అనే దానిపై ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరాతీస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా హైఅలర్ట్ ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కొత్త కేసులు నమోదయ్యాయి అcorona virus;andhra pradesh;central government;coronavirusఏపీలో కొత్త కరోనాపై కీలక ప్రకటనఏపీలో కొత్త కరోనాపై కీలక ప్రకటనcorona virus;andhra pradesh;central government;coronavirusFri, 25 Dec 2020 19:00:00 GMTకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరాతీస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా హైఅలర్ట్ ప్రకటించారు.

 అయితే ఆంధ్రప్రదేశ్ లో కొత్త కేసులు నమోదయ్యాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ దీనిపై చర్యలు తీసుకుంటూ ముందుకు వెళుతుంది. దీనిపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ కు గత నెల రోజుల కాలంలో 1148 మంది యూకే నుంచి వచ్చారు అని వెల్లడించింది. వీరిలో 1040 మందిని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది అని పేర్కొంది. వీరిలో 18మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉండగా, 16మంది ఇచ్చిన అడ్రస్ లు సరిపోలడం లేదు అని ప్రకటనలో తెలిపింది.

982మందిని గుర్తించి వారిని క్వారంటైన్ కు పంపించాం అని పేర్కొంది. ఈ 982 మందిలో నలుగురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది అని తెలిపింది. మిగిలిన వారి శాంపిల్స్ ను కూడా సీసీఎండి, ఎన్ఐవి పూణెకు పరీక్ష నిమిత్తం పంపాము అని చెప్పింది. కొత్త రకం కరోనా వైరస్ వీరిలో ఉందేమో పరీక్షిస్తున్నాం అని అన్నారు. ఫలితాలు రావడానికి మరో మూడు రోజుల సమయం పడుతుంది అని తెలిపింది. ప్రజలెవరూ ఈ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి కృష్ణాజిల్లాలో ఐదు ప్రాంతాలలో కోవిడ్ వ్యాక్సిన్ ట్రయిల్ రన్ ప్రారంభిస్తాము అని పేర్కొంది. కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకే కృష్ణాజిల్లాలో ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాము


టీపీసీసీ పదవి నాకివ్వకుంటే.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>