WomenP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/women_healthcare/woman0187a801-43ae-4bdd-93b8-1c1a8498224e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/women_healthcare/woman0187a801-43ae-4bdd-93b8-1c1a8498224e-415x250-IndiaHerald.jpgబరువు సమస్య లింగ భేదం లేకుండా అందరినీ పట్టి పీడిస్తుంది. అయితే దీని గురించి ఎక్కువ ఆందోళన చెందేది మాత్రం మహిళలే. యోగా, వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లు ఇలా ఏది కనిపిస్తే అది వాడేసి బరువు తగ్గాలని చాలా మంది మహిళలు ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా గృహిణుల్లో ఈ భయం చాలా ఎక్కువ. అధిక బరువు చిన్న సమస్య ఏమీ కాదు. దీన్ని సీరియస్ గా తీసుకోక పోతే చాలా ప్రమాదం. గుండె సమస్యలు, డయాబెటీస్ కు కారణం అవుతుంది. అందుకే దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని వైద్యులు కూడా చెప్తుంటారు.woman;jeevitha rajaseskhar;korcha;kanna lakshminarayana;heart;yogaకూర్చొన్న చోటే బరువు తగ్గించే సిపుల్ చిట్కాలు.. ఫాలో అయిపోతే సరి!కూర్చొన్న చోటే బరువు తగ్గించే సిపుల్ చిట్కాలు.. ఫాలో అయిపోతే సరి!woman;jeevitha rajaseskhar;korcha;kanna lakshminarayana;heart;yogaFri, 25 Dec 2020 11:13:19 GMTయోగా, వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లు ఇలా ఏది కనిపిస్తే అది వాడేసి బరువు తగ్గాలని చాలా మంది మహిళలు ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా గృహిణుల్లో ఈ భయం చాలా ఎక్కువ. అధిక బరువు చిన్న సమస్య ఏమీ కాదు. దీన్ని సీరియస్ గా తీసుకోక పోతే చాలా ప్రమాదం. గుండె సమస్యలు, డయాబెటీస్ కు కారణం అవుతుంది. అందుకే దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని వైద్యులు కూడా చెప్తుంటారు.

బరువు తగ్గడం కోసం యోగా క్లాసులు, జిమ్ముల వైపు యువత చూపు ఉంటుంది. అలాగే డైట్ ప్లాన్లు, ఆహారంపై నియంత్రణ కూడా దీనికి చాలా ముఖ్యమని నిపుణులు సూచనలు ఇస్తున్నారు. కేలరీలు మాత్రమే చూసుకోకుండా అన్ని రకాలుగా శరీరానికి ఉపయోగ పడే ఆహారం తీసుకోవాలని వారి సలహా. అదే సమయంలో ఎక్సర్ సైజులు, వాకింగ్, జాగింగ్, స్ట్రెచెస్ వంటివి కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగం.

ప్రస్తుత బిజీ ప్రపంచంలో మనకు ఏం చేయాలన్నా టైం దొరకడం కష్టం. ఎక్కువగా ఒక చోట కూర్చుని చేసే ఉద్యోగాలే. ఈ క్రమంలో కదలకుండా ఒక చోట కూర్చొని కూడా కొంత బరువు తగ్గడం సాధ్యమే అని కొందరు చెప్తున్నారు. దీని కోసం కొన్ని చిట్కాలు చెప్తున్నారు. మరి మనం కూడా వాటిపై ఓ లుక్కేద్దామా?

1. బబుల్ గమ్ తినడం వల్ల 10 కేలరీలు ఖర్చు అవుతాయట. అలాగే ఇది తినడం వల్ల ఆకలి కూడా అవ్వదు.
2. సాధ్యమైనంతగా నీళ్లు తాగడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంది.
3. కూర్చొని కూడా చేయగలిగే ఎక్సర్ సైజులపై దృష్టి పెడితే మంచిది.
4. చుట్టు పక్కల వారితో సరదాగా మాట్లాడటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కేలరీలు కూడా ఖర్చు అవుతాయి.
5. అరగంటకు ఓసారి లేచి కొంత దూరం నడవడం కూడా ఉత్తమం. దీని వల్ల మెటబాలిజం మెరుగవుతుంది.
6. జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. తాజా పండ్లు, ఆకుకూరలు వంటివి తీసుకోవాలి.
7. బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకొని అవి చేస్తూ ఉండాలి.
8. హ్యాండ్ గ్రిప్పర్స్, ఫింగర్ ట్విస్టర్స్ వంటివి క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.

వీటితోనే బరువు తగ్గిపోతామని కాదు కానీ, అసలేమీ చేయకుండా ఉండటం కన్నా ఇవి చేయడం మంచిది. కుదిరితే కొన్ని ఎక్సర్ సైజులను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ఉత్తమం. దీని వల్ల శరీరమే కాదు, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.


మాస్ రాజా ని తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది..?

నెహ్రూ జోస్యం నిజం చేసిన వాజ్ పేయ్

నూతన సంవత్సరంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేంద్రం!

దీదీకి సవాల్ కానున్న లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీల కూటమి!

తూర్పుతో బోణీ కొట్టబోతున్న జగన్ ?

'అమ్మ ఒడి' పధకం అనర్హుల జాబితా సవరణ సచివాలయ సిబ్బంది చేతుల్లోనే!

వైభవంగా ముక్కోటి ఏకాదశి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>