PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-pig-remains-used-for-that5b0430d8-70f6-40e4-bcda-f7d02301f52f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-pig-remains-used-for-that5b0430d8-70f6-40e4-bcda-f7d02301f52f-415x250-IndiaHerald.jpgక‌రోనా వ్యాక్సిన్ దేనితో తయారవుతోంది? ఈ వ్యాక్సిన్‌లో పంది అవ‌శేషాలు ఉన్నాయా? కరోనాకు విరుగుడు వచ్చిందని ప్రపంచమంతా ఊపిరిపీల్చుకుంటున్న వేళ... ముస్లిం బోర్డు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలేంటి? నిజంగా వ్యాక్సిన్‌లో పిగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయా? క‌రోనా దెబ్బకు అతలాకుతలమైన ప్రపంచదేశాలు.. వ్యాక్సిన్ వచ్చేయడంతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. చాలా దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ మొదలైంది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఇప్పుడో న్యూస్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది. వ్యాక్సిన్‌ తయారీలో పంis pig remains used for that;mandula;islamic countries;international;nijam;coronavirusపంది అవశేషాలు అందుకు వాడారా..?పంది అవశేషాలు అందుకు వాడారా..?is pig remains used for that;mandula;islamic countries;international;nijam;coronavirusFri, 25 Dec 2020 22:00:00 GMT
క‌రోనా దెబ్బకు అతలాకుతలమైన ప్రపంచదేశాలు.. వ్యాక్సిన్ వచ్చేయడంతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. చాలా దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ మొదలైంది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఇప్పుడో  న్యూస్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది. వ్యాక్సిన్‌ తయారీలో పంది అవశేషాలు వినియోగిస్తున్నారనే వార్త.. కొన్ని వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

కరోనా వ్యాక్సిన్‌లో పిగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయనే ప్రచారంతో... ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయంలో ముస్లిం సంఘాల నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముస్లింలు వ్యాక్సిన్‌ను వేసుకుంటారా? లేదా? అనే అనుమానం మొదలైంది.

సాధారణంగా వ్యాక్సిన్స్ తయారీలో పంది జెల‌టిన్ ను వాడుతుంటారు. ఈ జెల‌టిన్ వ‌ల్ల వ్యాక్సిన్ ర‌వాణా, స్టోరేజ్ ల‌లో ఇబ్బంది తలెత్తకుండా ఉండటంతో పాటు.. వ్యాక్సిన్స్ సేఫ్‌గా ఉంటాయి. అయితే, కొన్ని మందుల త‌యారీదారులు.. దీనికి ప్రత్యామ్నాయంగా చేప‌ల జెల‌టిన్ కూడా వాడుతుంటారు. కానీ,చాలా సంస్థలు నాణ్యత విషయంలో పంది జెల‌టిన్ వైపే మొగ్గుచూపుతుంటాయి.

ఇప్పుడు క‌రోనా వ్యాక్సిన్ లో పంది అవశేషాలు ఉన్నాయన్న అంశంపై .. యూఏఈ అత్యున్నత ఇస్లామిక్ అథారిటీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఫ‌త్వా కౌన్సిల్‌ కూడా స్పందించింది. కరోనా వైరస్ వ్యాక్సిన్లు ఇస్లాం పోర్క్ ఆంక్షల పరిధిలోకి రావని స్పష్టంచేశారు కౌన్సిల్‌ ప్రతినిధులు. మనిషి ప్రాణాన్ని కాపాడటం అత్యంత ముఖ్యమైన అవసరమని.. వ్యాక్సిన్లలోని పోర్క్ జిలటిన్‌ను మందుగా పరిగణించాలని పిలుపునిచ్చారు. దానిని ఆహారంగా చూడకూడదని స్పష్టం చేశారు. యావత్‌ మానవాళికి తీవ్ర నష్టం కలిగించే వైరస్‌ అంతం కోసం.. ఈ వ్యాక్సిన్లు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ప్రకటించారు. అంతర్జాతీయ ముస్లిం ప్రతినిధుల ప్రకటనతో... కరోనా వ్యాక్సిన్‌లలో పంది అవశేషాల వినియోగంపై వివాదం సద్దుమణిగిందనే చెప్పొచ్చు.







తిరుపతి పీటముడి....తెగేదాకా లాగితే ?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>