PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay56976921-c96b-41f4-ab54-bb006d12f5c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay56976921-c96b-41f4-ab54-bb006d12f5c3-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర బీజేపి కార్యదర్శి బండి సంజయ్ మాటల దూకుడు మాత్రం ఈ మధ్య కాస్త ఎక్కువగానే ఉంది.. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఆయన మాటలకు హద్దులు లేకుండా పోయాయి.. తెలంగాణ సర్కార్ పై ఎప్పటికప్పుడు మాటల యుద్ధం చేస్తూనే ఉన్నాడు.. అవి కాస్త దుమారం రేపాయి.. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయారు.. నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, సంఘ విద్రోహశక్తులను గుర్తించాలంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. bandi sanjay;jayanthi;nidhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;narendra modi;police;prime minister;central government;yatra;jayamమరోసారి తెలంగాణ సర్కార్ పై నోరుపారేసుకున్న బండి.. ఎందుకంటే ??మరోసారి తెలంగాణ సర్కార్ పై నోరుపారేసుకున్న బండి.. ఎందుకంటే ??bandi sanjay;jayanthi;nidhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;narendra modi;police;prime minister;central government;yatra;jayamFri, 25 Dec 2020 10:00:09 GMTతెలంగాణ రాష్ట్ర బీజేపి కార్యదర్శి బండి సంజయ్ మాటల దూకుడు మాత్రం ఈ మధ్య కాస్త ఎక్కువగానే ఉంది.. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఆయన మాటలకు హద్దులు లేకుండా పోయాయి.. తెలంగాణ సర్కార్ పై ఎప్పటికప్పుడు మాటల యుద్ధం చేస్తూనే ఉన్నాడు.. అవి కాస్త దుమారం రేపాయి.. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయారు.. నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, సంఘ విద్రోహశక్తులను గుర్తించాలంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.



అలా చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేస్తారన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలను గుర్తించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సత్వరమే రోహింగ్యాలు, సంఘ విద్రోహశక్తుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకాదు.. త్వరలోనే బస్సు యాత్ర చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.తెలంగాణలో భాజపా బలపడుతుందని గుర్తించి ఆదరాబాదరాగా ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్‌.. మేయర్‌ ఎన్నిక ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. 



రూ.5 కోట్లు ఇస్తాం.. తెరాసలోకి రావాలని భాజపా కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. అటల్ బిహారీ వాజపేయి ఆశయాలకు అనుగుణంగా దేశంలోని రైతులకు అండగా ఉండేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. రేపు వాజ్‌పేయీ జయంతి సందర్భంగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లను జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని బండి అన్నారు.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, మండలాల వారీగా అన్ని ఏర్పాట్లు చేశాం. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నూతన వ్యవసాయ చట్టాలపై కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. వీటన్నింటిపై రేపు ప్రధాని మోదీ వాస్తవాలను వివరిస్తారు.. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని రైతులు, వారి కుటుంబాలతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు..




దీదీకి సవాల్ కానున్న లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీల కూటమి!

'అమ్మ ఒడి' పధకం అనర్హుల జాబితా సవరణ సచివాలయ సిబ్బంది చేతుల్లోనే!

వైభవంగా ముక్కోటి ఏకాదశి

ఈ రోజుతో జగన్ సూపర్ హిట్టే ?

చికెన్ బిర్యానీ తెగ తినేశారు

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>