Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/guinnis-recordc5453dee-5640-4bb5-bb65-af460118d5c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/guinnis-recordc5453dee-5640-4bb5-bb65-af460118d5c0-415x250-IndiaHerald.jpgహర్యానాకు చెందిన 12 ఏళ్ల చిన్నారి సిద్ధార్థ్ గుంబర్.. తల్లిదండ్రులతో కలిసి యూఏఈలోని అబుదాబిలో ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి అతడికి కొత్త విషయాలు తెలుసుకోవాలని తెగ ఉత్సుకతతో.. guinnis record;siddharth;india;car;bike12 ఏళ్ల బుడ్డోడు గిన్నీస్ రికార్డు కొట్టాడు.. తోకచూసి విమానం గురించి చెప్పేస్తాడు12 ఏళ్ల బుడ్డోడు గిన్నీస్ రికార్డు కొట్టాడు.. తోకచూసి విమానం గురించి చెప్పేస్తాడుguinnis record;siddharth;india;car;bikeFri, 25 Dec 2020 16:33:55 GMTఇంటర్నెట్ డెస్క్: హర్యానాకు చెందిన 12 ఏళ్ల చిన్నారి సిద్ధార్థ్ గుంబర్.. తల్లిదండ్రులతో కలిసి యూఏఈలోని అబుదాబిలో ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి అతడికి కొత్త విషయాలు తెలుసుకోవాలని తెగ ఉత్సుకతతో ఉండేవాడు. తల్లిదండ్రులు కూడా కొడుకులోని ఉత్సాహాన్ని గమనించి ప్రోత్సహించేవారు. ఎక్కువగా లెగో టాయ్స్‌(ప్లాస్టిక్ తయారు చేసిన ఓ రకం బొమ్మలు)తో ఆడుకోవడమంటే సిద్ధార్థ్‌కు చాలా ఇష్టం. ఆ లెగో క్యూబ్స్‌తోనే ఎరోప్లేన్స్, బిల్డింగ్స్, వెహికల్స్.. వంటి అనేక రకాల బొమ్మలను కూడా తయారు చేసేవాడు.

ఇవన్నీ ఒక ఎత్తయితే సిద్ధార్థ్‌కు చిన్నప్పటి నుంచి విమానాలంటే ఎందుకో చాలా ఇష్టం. ఈ ఇష్టమే అతడిని ఓ విచిత్రమైన పనిచేసేందుకు పురిగొల్పింది. విమానాల తోకల ఆధారంగా ఆ విమానం ఏ కంపెనీకి చెందిదో గుర్తించడం ప్రారంభించాడు. కొడుకు చేస్తున్న పనిని గమనించిన తల్లిదండ్రులు అతడిని ఎంతగానో ప్రోత్సహించారు. సిద్ధార్థ్ తల్లి మోనీషా దీనికోసం ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి, ఏ విమానానికి ఎలాంటి తోక ఉంటుందో వివరించేవారు. దీంతో సిద్ధర్థ్ అతి తక్కువ కాలంలోనే ఎన్నో విమనాలను తోకలు చూసే గుర్తించడం మొదలెట్టాడు.

విమానాల బొమ్మలంటే ఆసక్తి ఉండడంతో వాటి గురించి ఎక్కువగా తెలుసుకునేవాడు సిద్దార్థ్. అయితే ఓ నెల క్రితం జరిగిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ పోటీలో కేవలం 60 సెకండ్లలో 39 విమానాల తోకలను చూసి అవి ఏ కంపెనీకి చెందినవో గుర్తించేశాడు. దీంతో గిన్నీస్ రికార్డునూ సొంతం చేసుకున్నాడు. ఇది మాత్రమే కాదు ప్రపంచంలోని 100 ఎత్తైన భవనాలను గుర్తించినందుకు కూడా సిద్దార్థ్‌కు ఇండియా బుక్‌లో ఇంతకు ముందే చోటు దక్కింది. తమ పిల్లాడు సాధించిన ఘనతపై తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు. గిన్నిస్ రికార్డ్ సాధించేందుకే సిద్ధార్థ్ ఏకాగ్రతతో కృషి చేశాడని, ప్రతి విమానాన్ని గుర్తించేందుకు అతడికి కేవలం 1.5 సెకండ్లు మాత్రమే పడుతుందని వారు చెప్పారు.

ఇదంతా చదువుతుంటే.. మనం చిన్నప్పుడు రోడ్డుపై వెళుతున్న బైక్‌లు, కార్లను చూసి చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు గుర్తొస్తున్నాయి కదా. వాటి డిజైన్ ఆధారంగా ఏ కంపెనీ బైక్, కార్ అనేది చెప్పుకుంటూ సరదాగా గడిపేవాళ్లం. అయితే మనం రోడ్లపైనే ఆగిపోతే.. సిద్ధార్థ్ మాత్రం ఏకంగా గాలిలో ఎగిరే విమానాల వరకు వెళ్లిపోయాడు. ఏదైనా పట్టుదలతో, ఏకాగ్రతతో చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తామనడానికి ఇదే నిదర్శనం.


పవన్ కళ్యాణ్ ఇంకా ఎప్పుడు మేల్కొంటాడు...?

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

షూటింగ్ కి లేట్ గా వస్తే హీరోయిన్ KR విజయకు ఏకంగా కోర్ట్ లో చుక్కలు చూపించిన ఎన్టీఆర్

ఫ్యామిలీ ''బ్యాక్ గ్రౌండ్"తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్లు!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>