MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/solobatukesobettermoviereview045901d6-ee38-40f4-8c5f-6a27b541add7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/solobatukesobettermoviereview045901d6-ee38-40f4-8c5f-6a27b541add7-415x250-IndiaHerald.jpg9 నెల‌ల నిరీక్ష‌ణ అనంతరం థియేట‌ర్లు తెర‌చుకున్నాయి. కొత్త సినిమాల కోసం ఎదురు చూసిన ప్రేక్ష‌కుల ముందుకు `సోలో బ‌తుకే సో బెట‌రు` వ‌చ్చింది. విరాట్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌)కి ఎమోష‌న్లు ఉండ‌వు. `సోలో బ‌తుకే సో బెట‌రు` అనే నినాదం త‌న‌ది. అట‌ల్ బిహారీ వాజ్‌పేయ్‌, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి లాంటి వాళ్ల‌ని స్ఫూర్తిగా తీసుకుని బ్ర‌హ్మ‌చ‌ర్యం పాటిస్తుంటాడు. 108 శ్లోకాల‌తో ఓ పుస్త‌కం రాసి, యువ‌త‌కు మార్గ నిర్దేశకం చేస్తాడు. త‌న‌లాంటి ఓ బ్యాచ్‌ని త‌యారు చేస్తాడు. వేణు మావ‌య్య (రావు ర‌మేష్‌) కూడా ఇలాంటి ఆద‌ర్శాలే. పెళ్solobathuke;amrutha;geetha;jeevitha rajaseskhar;vennela;vennela kishore;virat kohli;cinema;sangeetha;marriage;comedy;heroసోలోబతుకే సో బెటర్ ఎలా ఉందంటే...సోలోబతుకే సో బెటర్ ఎలా ఉందంటే...solobathuke;amrutha;geetha;jeevitha rajaseskhar;vennela;vennela kishore;virat kohli;cinema;sangeetha;marriage;comedy;heroFri, 25 Dec 2020 21:19:58 GMTసోలోబతుకే సో బెటర్ ఎలా ఉందంటే...
9 నెల‌ల నిరీక్ష‌ణ అనంతరం థియేట‌ర్లు తెర‌చుకున్నాయి. కొత్త సినిమాల కోసం ఎదురు చూసిన ప్రేక్ష‌కుల ముందుకు `సోలో బ‌తుకే సో బెట‌రు` వ‌చ్చింది.  విరాట్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌)కి ఎమోష‌న్లు ఉండ‌వు. `సోలో బ‌తుకే సో బెట‌రు` అనే నినాదం త‌న‌ది. అట‌ల్ బిహారీ వాజ్‌పేయ్‌,  ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి లాంటి వాళ్ల‌ని స్ఫూర్తిగా తీసుకుని బ్ర‌హ్మ‌చ‌ర్యం పాటిస్తుంటాడు. 108 శ్లోకాల‌తో ఓ పుస్త‌కం రాసి, యువ‌త‌కు మార్గ నిర్దేశకం చేస్తాడు. త‌న‌లాంటి ఓ బ్యాచ్‌ని త‌యారు చేస్తాడు. వేణు మావ‌య్య (రావు ర‌మేష్‌) కూడా ఇలాంటి ఆద‌ర్శాలే. పెళ్లి వ‌ద్దు – సోలో బ‌తుకే బెస్టు అంటూ మేన‌ల్లుడికి నూరిపోస్తాడు. చ‌దువు అయిపోయాక హైద‌రాబాద్ లో త‌న స్నేహితుల‌తో స్థిర‌ప‌డ‌తాడు విరాట్‌. అయితే త‌న బ్యాచ్ లోంచి  ఒకొక్క‌రుగా పెళ్లి వైపు అడుగులు వేస్తుంటారు. చివ‌రికి తాను ఒంట‌రి అయిపోతాడు. వేణు మావ‌య్య కి కూడా తాను న‌మ్మిన  ఫిలాస‌పీ త‌ప్పు అనే విష‌యం అర్థం అవుతుంది. అందుకే విరాట్ కూడా సోలో బ‌తుకుని వ‌దిలేసి, జీవితంలో స్థిర‌ప‌డాల‌నుకుంటాడు. మ‌రి త‌న‌కు కావ‌ల్సిన లైఫ్ పార్ట‌న‌ర్ దొరికిందా? లేదా? ఆ ప్ర‌యాణంలో తాను ఏం తెలుసుకున్నాడు..? అనేదే క‌థ‌. గతంలో వచ్చిన`వివాహ భోజ‌నంబు`, `మ‌న్మ‌థుడు` సినిమాలను కలిపి తీసినట్లుగా వుంది ఈ చిత్రం. ఫ‌స్టాఫ్ లో హీరో శ్లోకాలూ, పుస్త‌కాలు, ఫిలాస‌ఫీ అంటూ లాగించ‌డానికి కాస్త ఆస్కారం దొరికింది. దానికి వెన్నెల కిషోర్ కామెడీ ప్ల‌స్ అయ్యింది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ కూడా ఇంట్ర‌స్టింగ్ గానే అనిపించింది. క‌డుపుబ్బా న‌వ్వించే స‌న్నివేశాలు లేవు గానీ ఫ‌ర్వాలేదు లే.. అనే ఫీలింగ్ అయితే తీసుకొస్తాయి. సెకండాఫ్  ఏదో ఓ మ్యాజిక్ చేయాలి. అమృత (న‌భాన‌టేషా) క్యారెక్ట‌ర్ నుంచి అలాంటి వెరైటీ సృష్టించాడు.  కానీ స‌రైన రీతిలో వాడుకోలేక‌పోయాడు. త‌ర‌వాత ఏం జ‌రుగుతుంది? అనే విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మైపోతూ ఉంటుంది. దానికి తోడు ఫ‌స్టాఫ్‌లో పండిన వినోదం కూడా ద్వితీయార్థంలో క‌నిపించ‌దు.   సోలో బ‌తుకే కాస్త సో..సో..గానే మిగిలిపోయింది. త‌మ‌న్ పాట‌లు బాగున్నాయి. నేప‌థ్య సంగీతం.. ప్ల‌స్ అయ్యింది. మాట‌లు అక్క‌డ‌క్క‌డ మెరిశాయి. ముఖ్యంగా రావు ర‌మేష్ డైలాగుల్లో. `కొన్నిసార్లు క‌న్నీళ్లు తుడుచుకోవ‌డానికి మ‌న‌రెండు చేతులూ స‌రిపోవు.` అన్న డైలాగ్ బాగుంది. సుబ్బు రాసుకున్న క‌థ చాలా చిన్న‌ది. దానికి బ‌ల‌మైన పాత్ర‌లు, స‌న్నివేశాలు అవ‌స‌రం. కామెడీని గుప్పించి ఈ సినిమా న‌డపాలి. విరాట్ క్యారెక్ట‌రైజేష‌న్‌, వెన్నెల కిషోర్ కామెడీ, పాట‌లూ కాస్త బ‌లాన్ని అందించాయి.


ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

12 ఏళ్ల బుడ్డోడు.. గిన్నీస్ రికార్డు కొట్టాడు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>