HealthHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/rupeese406402d-b6dd-427d-b9e7-f00c2a28314e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/rupeese406402d-b6dd-427d-b9e7-f00c2a28314e-415x250-IndiaHerald.jpgప్రపంచంలో కొనేవారు ఉంటే అమ్మడానికి ఎలాంటి లోటు లేదు ఏది పడితే అది అమ్మేస్తున్నారు,కొనడానికి ముందుకు వస్తున్నారు.కానీ ఇప్పుడు అధికంగా గాలిని కూడా అమ్మేస్తున్నారు.మనకు సందేహం కలగవచ్చు ఈ విషయంలో ఏదైనా ఒక వస్తువుకు ఆకారం ఉండగలిగితేనే దానిని అమ్మడానికైనా,కొనడానికైనా వీలు అవుతుందని,కానీ ఇప్పుడు గాలి కంటికి కనిపించదు, చేత్తో ముట్టుకోలేము మరి ఎలా అమ్ముతారు.నీకేమన్నా పిచ్చా అనే సందేహం మనలో ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. నిజమే గాలిని సీసాలోకి పట్టి అమ్ముతున్నారు.rupees;tara;christmas;apple;england;ireland;scotland;wales;festival;air;vegetable market;letter;european union;custard appleగాలి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే!గాలి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే!rupees;tara;christmas;apple;england;ireland;scotland;wales;festival;air;vegetable market;letter;european union;custard appleFri, 25 Dec 2020 15:03:04 GMTప్రపంచంలో కొనేవారు ఉంటే అమ్మడానికి ఎలాంటి లోటు లేదు ఏది పడితే అది అమ్మేస్తున్నారు,కొనడానికి ముందుకు వస్తున్నారు.కానీ ఇప్పుడు అధికంగా గాలిని కూడా అమ్మేస్తున్నారు.మనకు సందేహం కలగవచ్చు ఈ  విషయంలో  ఏదైనా ఒక వస్తువుకు ఆకారం ఉండగలిగితేనే దానిని అమ్మడానికైనా,కొనడానికైనా వీలు అవుతుందని,కానీ ఇప్పుడు గాలి కంటికి కనిపించదు, చేత్తో ముట్టుకోలేము మరి ఎలా అమ్ముతారు.నీకేమన్నా పిచ్చా అనే సందేహం మనలో ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. నిజమే గాలిని సీసాలోకి పట్టి అమ్ముతున్నారు.
ఇది ఎక్కడ విడ్డూరమని విన్నవారంతా నోటి పైన చేయి వేసుకుంటున్నారు.

నిజానికి ఒక దేశంలో గాలిని బంధించి అమ్ముతున్నారు.అది ఎక్కడో ఎందుకు అమ్మవలసి వస్తుందో ఇప్పుడు మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.

యూకేలో గాలిని సీసాల్లో నింపి అమ్ముతున్నారు మై బ్యాగేజ్ అనే సంస్థ.యూకేలోని స్కాట్లాండ్,ఐర్లాండ్, వేల్స్, ఇంగ్లాండ్ లాంటి దేశాల నుండి స్వచ్ఛమైన గాలిని సీసాల్లో బంధిచి అమ్ముతున్నారు.అరలీటర్ గాలి 25 పౌండ్లు గా మార్కెట్ చేస్తున్నారు. అంటే ఇది మన భారత కరెన్సీలో అక్షరాలరూ. 2500 రూపాయలు.అంటే లీటర్ గాలి రూ. 5000  రూపయాలన్నమాట.సాధారణంగా గాలి కాలుష్యం అవుతుంది.ఇలాంటి సమయాల్లో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టం. కానీ ప్రస్తుతం కరోనా వల్ల గాలిని కూడా స్వేచ్ఛగా పీల్చుకోలేని దుస్థితి వచ్చింది.

ఎందుకంటే గాలి ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి.అయితే ఇప్పుడు బ్రిటన్ లో మరొక కొత్తరకం వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతోంది అయితే ఈ వైరస్ కోవిడ్ 19 కంటే 75 శాతం అధికంగా వ్యాపిస్తోంది.దీంతో ప్రపంచ దేశాలు మరోసారి ఉలిక్కిపడ్డాయి. వెంటనే అప్రమత్తం అయ్యి,బ్రిటన్ తో ఉన్న అన్ని సంబంధాలను నిలిపివేశారు.ఈ క్రమంలో వివిధ దేశాల్లో ఉండిపోయిన బ్రిటన్ వాసులు క్రిస్మస్ పండుగ కోసం వారి వారి సొంత ప్రాంతాలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి వారి సొంత ప్రాంతాల గాలిని ఒక్కసారైనా ఆస్వాదించాలని కోరుకునే వారు ఎందరో.అయితే ఆ వైరస్ కారణంగా మనసారా శ్వాసించలేని పరిస్థితి వచ్చింది.అయితే ఇలాంటి వారి కోసమే మై బ్యాగేజ్ సంస్థ ఒక శుభవార్త తెలిపింది.

సీసాల్లో నింపి స్వచ్ఛమైన గాలిని ప్రపంచ దేశాల్లో ఉన్న బ్రిటన్ వాసులకు అందిస్తామంటూ ప్రకటించింది. ప్రపంచంలో బ్రిటీన్ వాసులు ఎక్కడున్నా వారికి నచ్చిన గాలిని వారి ప్రాంతాల నుంచి సేకరించి బాటిల్స్లో నింపి డోర్ డెలివరీ కూడా చేస్తామని ప్రకటించింది.
మై బ్యాగేజ్ సంస్థ ఐర్లాండ్,స్కాట్లాండ్,ఇంగ్లాండ్,వేల్స్ నుంచి శుద్ధమైన గాలిని సేకరించి బాటిల్స్ లో నింపి అమ్మాలని నిర్ణయించుకుంది.ఇందులో కేవలం స్వచ్ఛమైన గాలి మాత్రమే కాకుండా అందులో వివిధ రకాలైన ఫ్లేవర్స్ తో కూడిన గాలిని అందిస్తుంది. అందులో చేపల వాసన, పండ్ల వాసన,పంటపొలాల వాసన ఇలా ఏది కోరితే ఆ వాసన కలిగిన గాలిని  అందజేస్తోంది. 


గుడ్ న్యూస్.. రైతులకు అన్ని ఫ్రీ ఫ్రీ..?

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్

దొంగతనాలు చేస్తున్న మంత్రిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

వినియోగదార్లకు టెస్లా క్రిస్మస్ గిఫ్ట్.. అబ్బో భలే ఉందిగా!

ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>