MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ram-charanee71f812-7d90-4d82-b41d-ea3acf17ef71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ram-charanee71f812-7d90-4d82-b41d-ea3acf17ef71-415x250-IndiaHerald.jpgసుష్మిత కొణిదెల ప్రొడ్యూసర్ గా మారింది. "షూటవుట్ ఎట్ ఆలేరు అనే వెబ్ సిరీస్" తో అలరించడానికి సిద్ధమైంది. అక్క కోసం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో పడ్డాడు చెర్రీ. ఒకవైపు "ఆర్ఆర్ఆర్" మరోవైపు "ఆచార్య" షూటింగ్ తో బిజీగా ఉన్నా అక్క కోసం టైం కేటాయించాడు. ఇదిలా పక్కన పెడితే... ram charan;ram charan teja;ram pothineni;rrr movie;konidela production;producer;producer1;fidaaసుష్మితకు చురకలంటించిన చెర్రీసుష్మితకు చురకలంటించిన చెర్రీram charan;ram charan teja;ram pothineni;rrr movie;konidela production;producer;producer1;fidaaThu, 24 Dec 2020 09:00:00 GMTకొణిదెల ప్రొడ్యూసర్ గా మారింది. "షూటవుట్ ఎట్ ఆలేరు" అనే వెబ్ సిరీస్ తో అలరించడానికి సిద్ధమైంది. అక్క కోసం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో పడ్డాడు చెర్రీ. ఒకవైపు "ఆర్ఆర్ఆర్" మరోవైపు "ఆచార్య" షూటింగ్ తో బిజీగా ఉన్నా అక్క కోసం టైం కేటాయించాడు. ఇదిలా పక్కన పెడితే...

చెర్రీ తన అక్కతో తనకున్న బాండింగ్ గురించి ఎంతో క్యూట్ గా చెప్పాడు. సెలెబ్రిటీస్ తమకు సంబంధించిన విషయాలు చెబుతున్నప్పుడు ఎంతో ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. చెర్రీ కూడా తన అక్కతో తన అనుబంధం గురించి చెబుతున్నప్పుడు ఫ్యాన్స్ వీరి బాండింగ్ కి ఫిదా అయిపోయారు.

అక్కకి ఓ వైపు సపోర్ట్ ఇస్తూనే మరోవైపు సరదాగా చురకలు అంటించాడు చెర్రీ. స్టైలిస్ట్ గా తన సినిమాలకు సుష్మిత పనిచేస్తోందని చెప్పాడు. రంగస్థలానికి కూడా సుష్మిత వర్క్ చేసిందని గుర్తుచేసుకున్నాడు. పనిలోపనిగా సుష్మిత తన ప్రొడక్షన్ లోని సినిమాకు స్టైలిస్ట్ గా పనిచేస్తే చెర్రీకి ఏ విధంగా తలనొప్పిగా ఉంటుందో చెప్పాడు.

'బయటివాళ్ళైతే తిట్టయినా సరే వర్క్ ను చేయించుకుంటాం, ఇంట్లో వాళ్ళు అయిపోయేసరికి ఏమీ అనలేము, మళ్ళీ ఇంటికెళ్లి ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి' అంటూ తిట్టాడా పొగిడాడా అన్న రేంజ్ లో సుష్మిత గురించి చెప్పాడు. ఇంకా ఈ ఫ్లోలో చరణ్ చెప్పుకుంటూ పోతుంటే సుష్మిత చెర్రీ దగ్గరికి వచ్చి ఇక ఆపు అన్నట్టుగా వారించింది. మొత్తానికి వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ సిబ్లింగ్స్ గోల్స్ ను సెట్ చేస్తోంది.  

ఇదిలా ఉంటే, రామ్ చరణ్ అక్కే తనకు బిగ్ సపోర్ట్ అని వెల్లడించాడు. తనకు ఎన్నో సందర్భాలలో సుష్మిత తన సపోర్ట్ ని అందించిందని గుర్తుచేసుకున్నాడు.

సుష్మిత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివైంది. ఫ్యాన్స్ తో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. తనపై తానే సెటైర్స్ వేసుకుంటోంది. అందుకే, పబ్లిగ్గా చెర్రీ చురకలు వేసినా సుష్మిత తన స్మైల్ తో స్పోర్టివ్ గా తీసుకుంది.  


అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>