PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/dont-want-your-love-letter-see-our-blood-letter0dbc8b05-8a34-4aee-a230-f09baf27826d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/dont-want-your-love-letter-see-our-blood-letter0dbc8b05-8a34-4aee-a230-f09baf27826d-415x250-IndiaHerald.jpgకేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టలపై గత కొన్ని రోజులుగా రగడ జరుగుతూనే వుంది.కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త విధానాలు రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేవని రైతు సంఘాలు దాదాపుగా 28 రోజుల నుండి నిరసనల బాట పట్టారు.అయితే వీటిని పూర్తిగా రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుంటే కేంద్రం సవరణలు చేస్తాం తప్ప రద్దు చెయ్యడం కుదరదు అని కరకండిగా చెప్పేస్తుంది.దీంతో ఈ వివాదం రోజురోజుకూ ముదురుతుంది.latest news;modi;benarjee;rahul new;rahul;vishwa;k l rahul;rahul gandhi;narendra modi;mamata banerjee;mohandas karamchand gandhi;prime minister;wife;rahul sipligunj;letter;central government;mamta mohandasమీ ప్రేమలేఖ వద్దు..మా రక్త లేఖ చూడండి !!మీ ప్రేమలేఖ వద్దు..మా రక్త లేఖ చూడండి !!latest news;modi;benarjee;rahul new;rahul;vishwa;k l rahul;rahul gandhi;narendra modi;mamata banerjee;mohandas karamchand gandhi;prime minister;wife;rahul sipligunj;letter;central government;mamta mohandasThu, 24 Dec 2020 09:00:00 GMTకేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టలపై గత కొన్ని రోజులుగా రగడ జరుగుతూనే వుంది.కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త విధానాలు రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేవని రైతు సంఘాలు దాదాపుగా 28 రోజుల నుండి నిరసనల బాట పట్టారు.అయితే వీటిని పూర్తిగా రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుంటే కేంద్రం సవరణలు చేస్తాం తప్ప రద్దు చెయ్యడం కుదరదు అని కరకండిగా చెప్పేస్తుంది.దీంతో ఈ వివాదం రోజురోజుకూ ముదురుతుంది.రైతు సంఘాలకు అనేక రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతుండడంతో ఉద్యమం యొక్క తీవ్రత పెరుగుతుంది. ఇది గమనించిన కేంద్రం రైతులతో ఇప్పటికే పలు మార్లు చర్చలు జరిపింది. అయితే చర్చల్లో రైతులు సవరణలకు ససేమిరా అనడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఓవైపు రైతులకు మద్దతు రోజురోజుకూ పెరుగుతూ వస్తుంది.ఇప్పటికే రాహుల్ గాంధీ,మమతా బెనర్జీ వంటి వారు రైతులకు అనుకూలంగా సంఘీభావం తెలపడంతో కేంద్రానికి కొత్త తల నొప్పి ఏర్పడింది.అయితే రైతు సంఘాలను ఉద్యమం విరమింపజేయాలని కేంద్రం విశ్వ ప్రయత్నలే చేస్తుంది.

కొత్త రైతు చట్టలకు అనుకూలంగా ఇప్పటికే 3,13,363 మంది రైతుల సంతకాలతో తమకు లేఖలు వచ్చాయని కేంద్రం తెలుపుతుంది. అయితే రైతు సంఘాలు మాత్రం కొత్త వ్యవసాయ చట్టాలు పూర్తిగా రద్దు చేసేవరకు ఉద్యమం ఆపేది లేదని తేల్చి చెప్తున్నాయి. అలసి సొలసి రైతులు తమంత తామే నిరసన ఆపేస్తారని ప్రభుత్వం చూస్తోందని ఆలిండియా కిసాన్‌ సభ నేత హనన్‌ మోలా విమర్శించారు. అది కేంద్రం ఊహ తప్ప మరొకటి లేదని ఆయన ఘాటుగానే సమాధానం ఇచ్చారు.  దీంతో రైతు సంఘాలతో మరొకసారి చర్చలు జరపాలని రైతులకు లేఖ పంపగా బుధవారం సింఘూ సరిహద్దు వద్ద సమావేశమైన 32 యూనియన్ల నేతలు మరోమారు వ్యవసాయ కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ రాసిన లేఖను చదివి చర్చించి పెదవి విరిచాయి.

 ‘అరమరికల్లేకుండా చర్చలు జరిపేందుకు మేం సిద్ధమే. అయితే కేంద్రం- కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను చట్టబద్ధం చేస్తున్నట్లు ప్రకటించాలి. దీంతోపాటు మరికొన్ని నిర్దుష్టమైన, కచ్చితమైన ప్రతిపాదనలను లిఖితపూర్వకంగా పంపిస్తే చర్చలకు వస్తాం’ అని స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌-  స్పష్టం చేశారు. అంతేకాక భారతీయ కిసాన్‌ యూనియన్‌ (లోక్‌శక్తి) చీఫ్‌ శివరాజ్‌సింగ్‌ రైతుల డిమాండ్లతో ప్రధాని  మోదీకి రక్తంతో ఓ లేఖ రాశారు. ‘చట్టాలను వెనక్కి తీసుకోవాలి. కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇస్తూ కొత్త చట్టం చేయాలి. రైతు కమిషన్‌ను ఏర్పాటు చేయలి’ అని లేఖలో రాశారు. ప్రధాని మోదీ డిసెంబర్‌ 25న దేశంలోని 9 కోట్ల మంది రైతులను ఉద్దేశించి ఉపన్యసించనున్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మరోమారు వెల్లడించనున్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు పాల్గొంటారు. మరి చట్టలపై మోడీ ఎలాంటి ప్రకటన చేస్తాడు అనేది సర్వత్ర చర్చనీయాంశం అయ్యింది.   


అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>