PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/strictly6f7f9cfc-533e-4a46-be18-d276138fa59a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/strictly6f7f9cfc-533e-4a46-be18-d276138fa59a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్లక్ష్య ధోరణి రాష్ర్ట ప్రజలకు శాపంగా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. అనంతపురం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం, బడన్నపల్లిలో బంగారు భవిష్యత్తు ఉన్న దళిత బిడ్డ స్నేహలత బలైపోయిందంటూ స్నేహలత మ‌ృతి పట్ల లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.‘రక్షించాలని వేడుకుంటూ ఏడ్చి, ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి అని ఒక తల్లి విలపిస్తుంది. strictly;auto;prema;rani;jagan;nara lokesh;andhra pradesh;district;smart phone;police;chief minister;twitter;love;petrol;police station;letter;tdp;traffic police;local languageనిర్లక్యాన్ని వీడండి.. స్నేహలతని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించండి :నిర్లక్యాన్ని వీడండి.. స్నేహలతని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించండి :strictly;auto;prema;rani;jagan;nara lokesh;andhra pradesh;district;smart phone;police;chief minister;twitter;love;petrol;police station;letter;tdp;traffic police;local languageThu, 24 Dec 2020 16:22:53 GMTట్విట్టర్ లో నారా లోకేశ్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్లక్ష్య ధోరణి రాష్ర్ట ప్రజలకు శాపంగా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. అనంతపురం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం, బడన్నపల్లిలో బంగారు భవిష్యత్తు ఉన్న దళిత బిడ్డ స్నేహలత బలైపోయిందంటూ స్నేహలత మ‌ృతి పట్ల లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.‘రక్షించాలని వేడుకుంటూ ఏడ్చి, ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి అని ఒక తల్లి విలపిస్తుంది. ప్రేమ పేరుతో కూతుర్ని, కుటుంబాన్ని టార్చర్ చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేస్తే ఇళ్ళు మారమని సలహా ఇచ్చింది వైకాపా ప్రభుత్వం’అని లోకేశ్ ట్వీట్ లో పేర్కొన్నారు. ‘కూతురు కనపడటం లేదంటూ ఫోన్ చేస్తే ఉదయం చూద్దాం అంటూ పోలీసుల సమాధానం, దిశ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే నీది ఏ రాష్ట్రం అని ప్రశ్నించి, లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్కోమని ఉచిత సలహా వచ్చింది. కాపాడుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వ అసమర్థత కారణంగా చదువులోనూ, స్పోర్ట్స్ లోనూ రాణించిన స్నేహాలత ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. అత్యంత కిరాతకంగా స్నేహలతని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. స్నేహలత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’అని లోకేశ్ డిమాండ్ చేశారు. కాగా, స్నేహలత మృతదేహం పాక్షికంగా దహనమైన స్థితిలో ధర్మవరం వద్ద ఓ కందిచేనులో కనిపించింది. నిన్నటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన స్నేహలత అనూహ్యరీతిలో హత్యకు గురికావడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ స్నేహితుడు ఫోన్ చేసి పిలిస్తే ఆమె వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే, ఆమెను గొంతు నులిమి చంపి, ఆపై పెట్రోల్ పోసి దహనం చేసేందుకు ప్రయత్నించినట్టు భావిస్తున్నారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.


" style="height: 627px;">






వ్యాక్సిన్ ముందుగా వీళ్ళకి ఇవ్వండి : దేశ పార్లమెంటరీ ప్యానెల్

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !

తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..!

బుడుగు: పిల్లలను శక్తి వంతులుగా చేసే దివ్య ఔషదం ఇదే..!

అలా చేస్తే ట్యాన్ కు టాటా చెప్పవచ్చా?

ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>