PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd2d78ece1-f410-40bc-8cbc-78a862cad3d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd2d78ece1-f410-40bc-8cbc-78a862cad3d0-415x250-IndiaHerald.jpgతిరుమల శ్రీవారి దర్శనం విషయంలో అధికారులు విమర్శలు రాకుండా వ్యవహరిస్తున్నారు. భక్తులకు శ్రీవారి దర్శనం అందించే విధంగా ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు వేకువజామున శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అని టీటీడీ అధికారులు నిన్న ప్రకటించారు. ఏట 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని టీటీడీ భక్తులకు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. నేడు వేకువ జామున 12.05 గంటలకు ఆలయాన్ని తెరిచారు అర్చకులు. ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం 4 గంటలకు ttd;darshana;sridevi kapoor;mahathi;tiru;school;january;tirupati;husband;good news;vegetable market;cinema tickets;office;good newwz;tirumala tirupathi devasthanamశ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ttd;darshana;sridevi kapoor;mahathi;tiru;school;january;tirupati;husband;good news;vegetable market;cinema tickets;office;good newwz;tirumala tirupathi devasthanamThu, 24 Dec 2020 10:00:00 GMTతిరుమల శ్రీవారి దర్శనం విషయంలో అధికారులు విమర్శలు రాకుండా వ్యవహరిస్తున్నారు. భక్తులకు శ్రీవారి దర్శనం అందించే విధంగా ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు వేకువజామున శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అని టీటీడీ అధికారులు నిన్న ప్రకటించారు. ఏట 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని టీటీడీ భక్తులకు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. నేడు వేకువ జామున 12.05 గంటలకు ఆలయాన్ని  తెరిచారు అర్చకులు.

ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం 4 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు దర్శనాన్ని టీటీడీ అధికారులు ప్రారంభించారు. ఉదయం 8గంటల నుంచి ప్రత్యేక, సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. జనవరి 3వ తేదీ అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూతపదతాయని అధికారులు వెల్లడించారు. 10 రోజుల్లో దాదాపు 4 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసిన టీటీడీ.... ఏ విధంగా కూడా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంది.

నేడు ఉదయం 9 గంటలకు స్వర్ణ రధం పై భక్తులకు శ్రీదేవి, భూదేవి సమేత  మలయప్ప స్వామి ధర్శనం ఇస్తారు. ద్వాదశిని పురస్కరించుకొని రేపు వరాహ పుష్కరిణిలో చక్రతాళ్వార్ కు చక్రస్నానాన్ని అర్చకులు నిర్వహిస్తారు. దర్శన టోకెన్లు వున్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతించనున్నారు టీటీడీ అధికారులు. తిరుపతి వాసులకు  వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ జారీ చేసారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ఎం.ఆర్. పల్లె మార్కెట్, రామానాయుడు మున్సిపల్ పాఠశాల, మున్సిపల్ ఆఫీసుల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ ల్లో టోకెన్ల జారీ చేసారు. ఊహించిన దానికంటే రద్దీ తక్కువగా కనపడింది. రాత్రి రెండు నుంచి టోకెన్స్ జారీ మొదలు పెట్టారు అధికారులు. ఉచిత దర్శనం తో పాటు ఒక లడ్డు ఉచితం గా పొందేలా టోకెన్ల జారీ చేసారు.


చంపుతున్న చలికి కారణం అదే ...!?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?

పవర్ స్టార్ కు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన ఆ ఇద్దరు..!

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>