MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dilraju89611642-c3ec-4620-a77c-e6165f42ae4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dilraju89611642-c3ec-4620-a77c-e6165f42ae4f-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు తీసే ప్రొడ్యూసర్ ఎవరన్నా ఉన్నారంటే అది దిల్ రాజు అనే చెప్పాలి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉంటారు దిల్ రాజు. ఈ ఏడాది కరోనా కారణంగా దిల్ రాజు బ్యానర్ నుంచి పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. ఈ ఏడాది ఆరంభంలోdilraju;pawan;naga chaitanya;kumaar;pawan kalyan;raj;sriram;vijay;vikram;cinema;f2;producer;director;producer1;joseph vijay;nijam;venu sreeram;dil;f32021లో మామూలుగా ఉండదంటున్న దిల్‌రాజు.. విషయమేంటంటే..2021లో మామూలుగా ఉండదంటున్న దిల్‌రాజు.. విషయమేంటంటే..dilraju;pawan;naga chaitanya;kumaar;pawan kalyan;raj;sriram;vijay;vikram;cinema;f2;producer;director;producer1;joseph vijay;nijam;venu sreeram;dil;f3Thu, 24 Dec 2020 15:56:13 GMTసినిమా ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు తీసే ప్రొడ్యూసర్ ఎవరన్నా ఉన్నారంటే అది దిల్ రాజు అనే చెప్పాలి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉంటారు దిల్ రాజు. ఈ ఏడాది కరోనా కారణంగా దిల్ రాజు బ్యానర్ నుంచి పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సందడి చేసిన దిల్ రాజు ఆ తరువాత కరోనా కారణంగా ఒక్క సినిమాను కూడా బయటకు తీసుకురాలేకపోయారు. దీంతో వచ్చే ఏడాది దిల్ రాజ్ బ్యానర్ నుంచి వరుస పెట్టి సినిమాలు విడుదల కానున్నాయి. ఐదు నుంచి పది సినిమాల వరకు దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు తెలుస్తోంది.

ఇందులో ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `వకీల్ సాబ్`, `ఎఫ్2` సీక్వెల్ `ఎఫ్3`, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా `థాంక్యూ`, విష్వక్సేన్ హీరోగా `పాగల్`తోపాటు `హుషారు` సినిమా డైరెక్టర్ తర్వాతి సినిమా కూడా దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్నాయి. దిల్ రాజు బ్యానర్‌లో ప్రస్తుతం ఐదు సినిమాలు సెట్స్ పైనే ఉన్నాయి. నిజంగా ఇదో రికార్డ్ అనే చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలో ఒకటి లేదా రెండు సినిమాల కంటే ఎక్కువగా ఏ ఒక్క ప్రొడ్యూసర్ కూడా కొత్త చిత్రాన్ని నిర్మాణం దశకు తీసుకెళ్లరు.

కానీ దిల్ రాజు రూటే సెపరేటు అన్న విధంగా ఒకే సారి పదుల సంఖ్యలో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఐదు సినిమాలు సెట్స్ పైన ఉండగా.. వీటితో పాటు అనేక సినిమాలను దిల్ రాజు లైన్‌లో పెట్టారు. విజయ్ దేవరకొండతోనూ దిల్ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని కుదిరితే ఈ సినిమా కూడా వచ్చే ఏడాది మొదట్లోనే సెట్స్ పైకి వెళ్లి ఏడాది చివరిలోగా విడుదలయ్యే అవకాశముంది. 


థియేటర్లలో ఎంజాయ్ చేద్దాం డ్యూడ్ .. పోయేదే ముంది మహా అయితే అందరితో కలిసి కాసేపు నవ్వుకోవచ్చు: ప్రభాస్

దుమారం రేపుతున్న ఏపీ మంత్రి వ్యాఖ్యలు

కోవిడ్ సెకండ్ వేప్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం: ఏపీ మంత్రి ఆళ్ల నాని

కత్తిపోట్లు ఆగవా...? పవన్ సంచలన వ్యాఖ్యలు

ఈ చేపలు తింటే మెదడు వాపు వస్తుందట.. తస్మాత్ జాగ్రత్త..?

సాయిపల్లవి ఆ యాడ్‌లో అందుకే నటించలేదట..!

అనుకున్నదే జరిగింది.. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఫిక్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>