MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-is-the-role-of-mega-son-in-acharya261d20ae-8cba-4415-8123-b4cc3c40e22f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-is-the-role-of-mega-son-in-acharya261d20ae-8cba-4415-8123-b4cc3c40e22f-415x250-IndiaHerald.jpgరామ్‌చరణ్‌.. చిరంజీవి.. రాజమౌళి. ఈ ట్రయాంగిల్‌ ఫైట్‌లో రాజమౌళీనే గెలిచాడు. ఆయన మాటే నెగ్గింది. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తి కాకుండా ఆచార్య షూట్‌లో పాల్గొనే అవకాశం రామ్‌చరణ్‌కు ఇవ్వలేదు జక్కన్న. ఆచార్య కోసం చెర్రీపై ఎన్ని రోజులు షూట్‌ చేస్తారు? ఇంతకీ ఈ మెగా తండ్రీకొడుకులు ఎప్పుడు కలిసి వర్క్‌ చేస్తారనే దానిపై అభిమాన లోకంలో సందేహం నెలకొంది. what is the role of mega son in acharya;chiranjeevi;ram charan teja;kiara advani;ram pothineni;rajamouli;february;fatherఆచార్యలో మెగా తనయుడి పాత్ర ఏంటో..!ఆచార్యలో మెగా తనయుడి పాత్ర ఏంటో..!what is the role of mega son in acharya;chiranjeevi;ram charan teja;kiara advani;ram pothineni;rajamouli;february;fatherThu, 24 Dec 2020 18:00:00 GMT
ఆచార్యలో రామ్‌చరణ్‌ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడు. రెండేళ్లుగా ఆర్‌ఆర్‌ఆర్‌ తప్ప మరో మూవీలో నటించలేదు. రాజమౌళి దగ్గర పర్మిషన్‌ తీసుకొని.. ఆచార్యను కంప్లీట్‌ చేసేస్తే.. కెరీర్‌ గ్యాప్‌లో పడిపోదన్న ప్లాన్‌లో ఉన్నాడు చెర్రీ. అయితే.. కరోనా తర్వాత  అన్ని సినిమాల కంటే  ఆలస్యంగా ఆచార్య షూటింగ్‌ మొదలైంది. కరోనా హాలిడేస్‌లో దర్శకుడు ఆచార్య కథలో మార్పులు చేర్పులు చేశాడు. ఈ క్రమంలో.. రామ్‌చరణ్‌ పాత్ర లెంగ్త్‌ పెరిగింది. రెండు నెలలపాటు పాల్గొంటేగానీ.. ఆయన పాత్ర పూర్తికాదు.

ఆర్‌ఆర్‌ఆర్‌ మొదలైందో లేదో.. 50 రోజులపాటు నైట్‌ షూట్‌ పూర్తిచేసుకుంది. ఆ మధ్య రామ్‌చరణ్‌ జోడీ అలియాభట్‌పై కొన్ని సీన్స్ తీశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలన్న పట్టుదలతో రాజమౌళి ఉన్నాడు.  దీంతో.. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తయిన తర్వాతే ఆచార్య షూట్‌లో జాయిన్‌ అవుతాడు చెర్రీ.
ఆచార్యలో రామ్‌చరణ్‌ పార్ట్‌ షూట్‌ను ఫిబ్రవరి చివర్లో మొదలుపెట్టి.. రెండు నెలల్లో పూర్తిచేస్తారట.

రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ పేరు వినిస్తున్నా.. ఎనౌన్స్ చేయలేదు. ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఆచార్యను మే 7న రిలీజ్‌ చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారు నిర్మాతలు. మొత్తానికి ఆచార్య మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. తండ్రి హీరోగా నటించే ఆ సినిమాలో రామ్ చరణ్ కీ రోల్ పోషించడంతో మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తి కరమైన సీన్స్ ఏంటా అని ఫ్యాన్స్ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.









బాదం ఆకులు దొరకలేదని రాజేంద్ర ప్రసాద్ "పెళ్లిపుస్తకం" షూటింగ్ ఆగిపోయింది అంటే నమ్ముతారా..?

కమలం నేతలకు.. పోలీసులకు మధ్య మాటల మంటలు..!

15 నిమిషాలు ఇవ్వండి... ఓల్డ్ సిటీలో దుమ్ము రేపుతా

2022 నుంచి 10 జట్లతో ఐపీఎల్.. ఒలింపిక్స్‌లో టీ20కి బీసీసీఐ మద్దతు

సిఎంకు తోడుగా రెండు రాష్ట్రాల నేతలు...?

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>