PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/naniab067518-56e0-4aac-ad77-fde0c8a9edeb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/naniab067518-56e0-4aac-ad77-fde0c8a9edeb-415x250-IndiaHerald.jpgకోవిడ్ సెకండ్ వేవ్ విషయంలో పూర్తి స్థాయిలో ఏపి ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపి లో జాగ్రత్తలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు ద్వారా కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తుండడంతో విమాన ప్రయాణికుల రాక పోకలపై దృష్టి పెట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అదేశించారని మంత్రి తెలిపారు.nani;auto;nani;delhi;godavari river;andhra pradesh;district;east;east godavari;smart phone;chief minister;minister;alla ramakrishna reddy;letter;central government;reddy;rajahmundry;coronavirusకోవిడ్ సెకండ్ వేప్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం: ఏపీ మంత్రి ఆళ్ల నానికోవిడ్ సెకండ్ వేప్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం: ఏపీ మంత్రి ఆళ్ల నానిnani;auto;nani;delhi;godavari river;andhra pradesh;district;east;east godavari;smart phone;chief minister;minister;alla ramakrishna reddy;letter;central government;reddy;rajahmundry;coronavirusThu, 24 Dec 2020 15:45:00 GMTకోవిడ్ సెకండ్ వేవ్ విషయంలో పూర్తి స్థాయిలో ఏపి ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపి లో జాగ్రత్తలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు ద్వారా కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తుండడంతో విమాన ప్రయాణికుల రాక పోకలపై దృష్టి పెట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అదేశించారని మంత్రి తెలిపారు. విదేశి విమానాల్లో ప్రయాణించి రాష్ట్రానికి చేరుకున్న వారికీ ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అదేశించామన్నారు.
ప్రత్యేకంగా విమానశ్రయాల్లోనే ప్రయాణికులకు పరీక్షలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అదేశించినట్లు వెల్లడించారు. ప్రయాణికులు, సిబ్బంది కోసం పిపిఈ కిట్స్ అందుబాటులో ఉంచాలని కూడ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు ఆళ్ల నాని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో హెల్ప్ డెస్క్ లు కూడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో యూకే నుండి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. వారికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించడం కోసం అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా డీఎంహెచ్ఓ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. యూకే నుండి ఏపీ ఎక్సప్రెస్ లో వచ్చిన మేరీ విని ప్రడ్ యాన్ కు పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఢిల్లీ ఎయిర్ ఫోర్ట్ నుండి రిపోర్ట్ వచ్చిందన్నారు. ఆమెతో పాటు కుమార్డ్ రియాన్ ను రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించామన్నారు. ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. తాజా పరిణామాలు నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశామన్నారు. మహిళకు సోకిన కరోనా వైరస్ రెండో వేవ్ లోనా... కాదా అనేది నిర్ధారణ చేసే పనిలో తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారని తెలిపారు. నమూనాలు సేకరించి పరీక్షలు నిమిత్తం పూనే ల్యాబ్ కు పంపించడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చేందనవసరం లేదన్నారు. ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని.. ముందుస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. కరోనా నిబంధనలు.. జాగ్రత్తలు ప్రజలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి ఆళ్ళ నాని సూచించారు.


వ్యాక్సిన్ ముందుగా వీళ్ళకి ఇవ్వండి : దేశ పార్లమెంటరీ ప్యానెల్

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !

తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..!

బుడుగు: పిల్లలను శక్తి వంతులుగా చేసే దివ్య ఔషదం ఇదే..!

అలా చేస్తే ట్యాన్ కు టాటా చెప్పవచ్చా?

ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>