PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/freepowerc4802175-3c75-4eea-b8c2-8ceed1616c58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/freepowerc4802175-3c75-4eea-b8c2-8ceed1616c58-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసేందుకు సమాయత్తం అవుతోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల దెబ్బతో హామీలపై దృష్టి సారించింది. జనవరి నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయనుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు సంబంధించిన సమాచారాన్ని డిస్కమ్‌లు తెప్పించుకున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్‌కు నివేదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నాయి. సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీలకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయనున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫfreepower;amala akkineni;jyothi;vidya;telangana;scheduled caste;scheduled tribes;januaryన్యూ ఇయర్ నుంచి ఫ్రీ కరెంట్న్యూ ఇయర్ నుంచి ఫ్రీ కరెంట్freepower;amala akkineni;jyothi;vidya;telangana;scheduled caste;scheduled tribes;januaryThu, 24 Dec 2020 12:55:22 GMT న్యూ ఇయర్ నుంచి ఫ్రీ కరెంట్

తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసేందుకు సమాయత్తం అవుతోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల దెబ్బతో హామీలపై దృష్టి సారించింది.  

జనవరి నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయనుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు సంబంధించిన సమాచారాన్ని డిస్కమ్‌లు తెప్పించుకున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్‌కు నివేదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నాయి.  సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీలకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయనున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 20 వేల లీటర్ల దాకా తాగునీటిని ఉచితంగా సరఫరా చేయడానికి  కసరత్తును ప్రారంభించింది.  తాజాగా మరో కీలక ఎన్నికల హామీని తీర్చడానికి సమాయత్తమవుతోంది. వాస్తవానికి సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఈ ప్రకటనకు ఆమోదం తెలపాల్సి ఉండగా పెండింగ్‌లో పడింది. ఆయన ఆమోదించాక ప్రకటన వెలువడనుంది.  ఎన్నికల ముందు ప్రతీ నెల 300 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్‌ను సెలూన్లు, ధోబీ ఘాట్లకు ఇవ్వడానికి  ప్రతిపాదన సిద్ధమయింది.  తాజాగా ఏయే ప్రాంతాల్లో ఏయే సెలూన్లు ఎంత మేర విద్యుత్‌ను వినియోగిస్తున్నాయో వివరాలను సేకరించారు.

24 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా కరెంట్‌ ఇస్తుండగా... 101 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే ఎస్సీ, ఎస్టీ వర్గాలకూ ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నారు. తాజాగా క్షురకులు, రజకులు కూడా ఈ జాబితాలో చేరనున్నారు.  




పరువు తీస్తున్నావంటూ సామ్ పై కామెంట్స్

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>