PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi748b56b0-1f3d-4f31-8d93-e6007ab9f038-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi748b56b0-1f3d-4f31-8d93-e6007ab9f038-415x250-IndiaHerald.jpgఈ మద్య మోసాలకు పాల్పడే వాళ్ళు బ్యాంక్ ఉద్యోగులమని, మిలటరీ అధికారులమని, మరి కొందరేమో ఏకంగా పోలీసులు అంటూ మోసాలకు దారుణాలకు పాల్పడుతున్నారు..ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగి పోతున్నాయి. గత నెలలో మిలటరీ ఆఫీసర్ ను అంటూ వాహనాలను తక్కువ ధరలకు ఇప్పిస్తామంటూ కొందరు జనాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు.. ఈ ఘటన పూర్తిగా మరువక ముందే ఇప్పుడు మరో దారుణం వెలుగు చూసింది..పోలీసు అధికారిని అంటూ ఓ వ్యక్తి మహిళ పై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. delhi;women;kumaar;sandeep;delhi;meerut;smart phone;police;bank;uttar pradesh;woman;traffic policeపోలీస్ అధికారి అంటూ రెచ్చిపోయాడు.. చివరికి అలా బుక్కయ్యాడు..పోలీస్ అధికారి అంటూ రెచ్చిపోయాడు.. చివరికి అలా బుక్కయ్యాడు..delhi;women;kumaar;sandeep;delhi;meerut;smart phone;police;bank;uttar pradesh;woman;traffic policeThu, 24 Dec 2020 11:00:00 GMTబ్యాంక్ ఉద్యోగులమని, మిలటరీ అధికారులమని, మరి కొందరేమో ఏకంగా పోలీసులు అంటూ మోసాలకు దారుణాలకు పాల్పడుతున్నారు..ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగి పోతున్నాయి. గత నెలలో మిలటరీ ఆఫీసర్ ను అంటూ వాహనాలను తక్కువ ధరలకు ఇప్పిస్తామంటూ కొందరు జనాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు.. ఈ ఘటన పూర్తిగా మరువక ముందే ఇప్పుడు మరో దారుణం వెలుగు చూసింది..పోలీసు అధికారిని అంటూ ఓ వ్యక్తి మహిళ పై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..



వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో వెలుగు చూసింది. మీరట్ లోని సందీప్ కుమార్ అనే యువకుడు ఢిల్లీ పహర్ గంజ్ ప్రాంతంలోని ఓ హోటల్ లో తాను యూపీ పోలీసు అధికారినంటూ చెప్పి ఓ మహిళపై అత్యాచారం జరిపినట్లు తేలింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ అత్యాచార బాగోతంపై తాము నిందితుడు సందీప్ కుమార్ పై కేసు నమోదు చేశామని డీసీపీ సంజయ్ భాటియా చెప్పారు. నిందితుడు సందీప్ కుమార్ పోలీసు అధికారినంటూ నకిలీ గుర్తింపుకార్డుతో హోటల్ లో గదిని బుక్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.



నకిలీ పోలీసు గుర్తింపు కార్డుతో హోటల్ లో రూం ను కూడా బుక్ చేశాడు..పోలీసులు సీసీటీవీ ఫుటేజీలతోపాటు నిందితుడి కాల్ రికార్డులను పోలీసులు పరిశీలించారు.అలాగే పోలీసును అని చెప్పి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని బార్ లను కూడా మోసం చేశాడని పోలీసుల విచారణలో బయటపడింది. మొబైల్ ఫోన్ నంబర్లు మారుస్తూ మహిళలతో సంప్రదింపులు జరిపాడని తేలిందని డీసీపీ చెప్పారు. తాను యూపీ పోలీసు అధికారినంటూ నటిస్తూ అమాయక మహిళలను ట్రాప్ చేశానని నిందితుడు వెల్లడించాడు. నిందితుడి అద్దె ఇంటి నుంచి యూపీ పోలీసు నేమ్ ప్లేటు, 3 మొబైల్ ఫోన్లు, రెండు నకిలీ గుర్తింపుకార్డులను స్వాధీనం చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు డీసిపి తాజాగా వెల్లడించారు. ఎన్ని మోసాలకు పాల్పడ్డాడు అనే విషయాన్ని పోలీసులు లాగే ప్రయత్నం చేస్తున్నారు..




పుష్ప పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుందిగా..?

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>