PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp80fab8ee-d345-40d3-9651-01483a9ce954-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp80fab8ee-d345-40d3-9651-01483a9ce954-415x250-IndiaHerald.jpg అనంతపురం జిల్లాలో స్నేహలత అనే యువతిపై జరిగిన అమానుష ఘటనను తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. బాధితురాలి తల్లిదండ్రులకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనకు బాధ్యులైన దోషులకు కఠిన శిక్ష పడే వరకు తెలుగు దేశం పార్టీ పోరాడుతుందని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే తన కుమార్తె ప్రాణాలతో ఉండేదని చంద్రబాబుతో స్నేహలత తల్లి వాపోయినట్లు సమాచారం. tdp;auto;cbn;telugu desam party;jagan;district;telugu;scheduled caste;smart phone;police;chief minister;petrol;police station;letter;tdp;traffic police;partyదోషులకు శిక్ష పడే వరకు టీడీపీ పోరాడుతుందిదోషులకు శిక్ష పడే వరకు టీడీపీ పోరాడుతుందిtdp;auto;cbn;telugu desam party;jagan;district;telugu;scheduled caste;smart phone;police;chief minister;petrol;police station;letter;tdp;traffic police;partyThu, 24 Dec 2020 17:00:00 GMTస్నేహలత తల్లిదండ్రులతో టీడీపీ అధినేత చంద్రబాబు
అనంతపురం జిల్లాలో స్నేహలత అనే యువతిపై జరిగిన అమానుష ఘటనను తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. బాధితురాలి తల్లిదండ్రులకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనకు బాధ్యులైన దోషులకు కఠిన శిక్ష పడే వరకు తెలుగు దేశం పార్టీ పోరాడుతుందని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే తన కుమార్తె ప్రాణాలతో ఉండేదని చంద్రబాబుతో స్నేహలత తల్లి వాపోయినట్లు సమాచారం. బ్యాంకు నుంచి విధులు ముగించుకుని బయల్దేరిన తమ కుమార్తె ఇంటికి రాలేదంటూ మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశామని, పోలీసులు సరిగా స్పందించలేదని స్నేహలత తల్లి చంద్రబాబు దృష్టికి తెచ్చినట్లు తెలుస్తుంది. మహిళలకు రక్షణ కల్పించడంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో శాంతిభద్రతలు దిగజారాయని ఆయన విమర్శించారు. స్నేహలత కుటుంబానికి టీడీపీ అన్ని విధాల అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చంద్రబాబు తెలిపారు. అనంతరం పురం జిల్లా ధర్మపురంలో మండలానికి చెందిన బడన్నపల్లిలోస్నేహలత(19) అనే ఎస్సీ వర్గానికి చెందిన యువతిని అత్యంత పాశవికంగా హతమార్చారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె గొంతు నులిమి చంపినట్లు భావిస్తున్నారు.స్నేహలత మృతదేహం పాక్షికంగా దహనమైన స్థితిలో ధర్మవరం వద్ద ఓ కందిచేనులో కనిపించింది. నిన్నటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన స్నేహలత అనూహ్యరీతిలో హత్యకు గురికావడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ స్నేహితుడు ఫోన్ చేసి పిలిస్తే ఆమె వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే, ఆమెను గొంతు నులిమి చంపి, ఆపై పెట్రోల్ పోసి దహనం చేసేందుకు ప్రయత్నించినట్టు భావిస్తున్నారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.


వ్యాక్సిన్ ముందుగా వీళ్ళకి ఇవ్వండి : దేశ పార్లమెంటరీ ప్యానెల్

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !

తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..!

బుడుగు: పిల్లలను శక్తి వంతులుగా చేసే దివ్య ఔషదం ఇదే..!

అలా చేస్తే ట్యాన్ కు టాటా చెప్పవచ్చా?

ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>