PoliticsP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-holidaysf157d9db-2dac-4161-a3c7-aac0d095f36c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-holidaysf157d9db-2dac-4161-a3c7-aac0d095f36c-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లకు కరోనా సెలవులు కొనసాగుతూనే ఉన్నాయి. 2020-2021 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి వరకూ స్కూళ్లకు సెలవులను ప్రకటించాలని విద్యా శాఖ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా ప్రాధమిక పాఠశాలలు ఇక తెరచుకొనట్లేనని తెలుస్తోంది. కాగా, ఈ విద్యా సంవత్సరం దెబ్బ తినకుండా ఈ విద్యార్ధులందరినీ వచ్చే ఏడాది పై తరగతులకు పంపించనున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని అల్ల కల్లోలం చేసిన సంగతి తెలిసిందే. దేశ దేశాలు చుట్టుముట్టిన ఈ కరోనా కారణంగా కోట్లాదిమంది ప్రాణcorona holidays;vidya;telangana;2020;letterఐదు వరకూ కరోనా సెలవులుఐదు వరకూ కరోనా సెలవులుcorona holidays;vidya;telangana;2020;letterThu, 24 Dec 2020 14:08:58 GMTతెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లకు కరోనా సెలవులు కొనసాగుతూనే ఉన్నాయి. 2020-2021 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి వరకూ స్కూళ్లకు సెలవులను ప్రకటించాలని విద్యా శాఖ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా ప్రాధమిక పాఠశాలలు ఇక తెరచుకొనట్లేనని తెలుస్తోంది. కాగా, ఈ విద్యా సంవత్సరం దెబ్బ తినకుండా ఈ విద్యార్ధులందరినీ వచ్చే ఏడాది పై తరగతులకు పంపించనున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని అల్ల కల్లోలం చేసిన సంగతి తెలిసిందే. దేశ దేశాలు చుట్టుముట్టిన ఈ కరోనా కారణంగా కోట్లాదిమంది ప్రాణాలు కోల్పోయారు. వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయి. మొదట్లో లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలలు ఇళ్లకే పరిమితమై అనేక మానసిక రుగ్మతలకు లోనైనవాళ్ళూ ఉన్నారు.


కరోనా నియంత్రణకు ముందు జాగ్రత్త చర్యగా టీకాలను పరిశోధించే పనిలో వైద్య శాస్త్రజ్ఞులు ఉన్నారు. అయితే, ఆ టీకాలు ఎప్పుడు వినియోగంలోకి వస్తాయో ఇప్పటికీ చెప్పలేని అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. రోజుకో ప్రచారం, తేదీల ప్రకటన జరుగుతూ వస్తోంది. 


కాగా, తాజాగా రూపు మార్చుకున్న కరోనా స్ట్రెయిన్ భయం మళ్ళీ జనాలను వెంటాడుతోంది. దాంతో విదేశీ యాత్రికులు విమానాశ్రయంలో దిగి దిగగానే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పాజిటివ్ ఉంటే వెనువెంటనే హాస్పిటల్స్ కి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. నెగిటివ్ ఉన్నా ఐసొలేషన్ కి తరలిస్తున్నారు. 
వివిధ రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూ  విధిస్తున్నారు. 


ఇలాంటి నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని సామాజిక వేత్తలు జాగ్రత్తలు చెప్తున్నారు.చిన్న పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లితండ్రులు జంకుతున్నారు. కరోనా జాగ్రత్తలు ఈ చిన్నారులు పాటించలేరని ఆందోళన చెందుతున్నారు. 


భౌతిక దూరం పాటించలేరని వాళ్ళు అంటున్నారు. ఈ కారణాల నేపథ్యంలో తరగతి గదుల్లో బోధన వద్దని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. విద్యాశాఖాధిపతులతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ ఓ సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు. నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ చదువుతున్నవాళ్ళు సుమారు ఆరేడు లక్షల మంది  ఉంటారు. ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఒకటి నుంచి అయిదు వరకూ చదివే విద్యార్థులు దాదాపు 11 . 36 లక్షల మంది ఉంటారు. ప్రైవేట్ స్కూళ్లలో 15లక్షల మంది ఉంటారు. వీరందరికీ ఈ విద్య సంవత్సరం కరోనా సెలవులే.



తండ్రితో పొలం వెళ్లిన మూడేళ్ళ చిన్నారి.. చివరికి సజీవదహనం..?

బామ్మ లక్ మామూలుగా లేదుగా.. పొరబాటున పోస్టు చేసిన 60వేలు ఎలా తిరిగొచ్చాయో చూడండి!

ఎంజీఆర్‌‌ గా అరవిందస్వామి కొత్త లుక్ చూశారా.. అదిరిపోయింది!

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>