Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-pawan-kalyan-in-tribal-stations64aa866d-71e7-4793-8548-fb8ede98fb8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-pawan-kalyan-in-tribal-stations64aa866d-71e7-4793-8548-fb8ede98fb8f-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఉన్నట్లుండి ఆదివాసీ గూడెంలో కనిపించారు. అక్కడి ఆదివాసీలతో ముచ్చటించారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాలిటిక్స్‌కు కొంచెం విరామం ఇచ్చిన పవర్‌స్టార్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా..pavan kalyan;pawan;kalyan;pawan kalyan;janasena;cinema;twitter;culture;janasena party;yatra;vఆదివాసీ గూడెంలో పవన్ కళ్యాణ్ఆదివాసీ గూడెంలో పవన్ కళ్యాణ్pavan kalyan;pawan;kalyan;pawan kalyan;janasena;cinema;twitter;culture;janasena party;yatra;vThu, 24 Dec 2020 15:04:32 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఉన్నట్లుండి ఆదివాసీ గూడెంలో కనిపించారు. అక్కడి ఆదివాసీలతో ముచ్చటించారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాలిటిక్స్‌కు కొంచెం విరామం ఇచ్చిన పవర్‌స్టార్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా తరువాత మరికొన్ని సినిమాల్లో నటించేందుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా పవన్‌ కళ్యాన్ అరకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడి ఆదివాసీలను కలిసి మాట్లాడారు. వారి గురించి, జీవన స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు.  

ఈ సందర్భంగా ఆదివాసీలు పవన్ కోసం ఓ పాట పాడారు. ఈ పాటలో తమ జీవితాన్ని, అక్కడి జీవన స్థితిగతుల్ని వివరించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పవన్ కళ్యాణ్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘‘నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో.. అరకు ఆదివాసీల, ఆంధ్ర-ఒరియాలో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట.. (వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన 'వనవాసి'  గుర్తుకువచ్చింది)` అంటూ ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

ఈ ట్వీట్‌కు ముందు కూడా పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. అందులో ‘జనసేన పోరాట యాత్ర లో భాగంగా ' అరకు పర్యటన లో ఆదివాసీల జీవన పరిస్థితులు బాధ కలిగించినాయి. ఆదివాసీల సంస్కృతి పరిరక్షింపబడాలి , వారి జీవన స్థితిగతుల్లో మార్పు  తీసుకురావటానికి జనసేన - జనసైనికులు నిరంతరం వారికీ అండగా ఉంటాం ..’ అని ట్వీట్ చేశారు. నాలుగు గంటల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియోను 25 వేలకు పైగా నెటిజన్లు లైక్ చేశారు. 8 వేల వరకు రీట్వీట్‌ నమోదయ్యాయి. 8వందల వరకు కామెంట్లు వచ్చాయి.

ఆదివాసీలతో ముచ్చటించే సమయంలో పవన్ బ్లాక్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించారు. ఆదివాసీలు పాడే పాటకు నెమ్మదిగా కాలితో తాళం వేస్తూ పరవశిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడవచ్చు.

" style="height: 434px;">




చిరంజీవిపై విరుచుకుపడ్డ బాలకృష్ణ. ఆ నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఆదివాసీలు పాడిన ఆ పాట వింటుంటే ఆయన రాసిన ‘వనవాసి’ గుర్తుకొచ్చింది: పవర్ స్టార్ పవన్ కల్యాణ్

ఇంకు ఖర్చు వృధా ఎందుకు.. అందుకే పేరు మార్చుకున్నా..!

ప్రేమలో పడ్డ వరుణ్ తేజ్.ఆమె ఎవరో తెలుసా..?

రామ్ రెడ్ ట్రైలర్ చూశారా.. డబుల్ రోల్‌లో అదరగొట్టాడు

తండ్రితో పొలం వెళ్లిన మూడేళ్ళ చిన్నారి.. చివరికి సజీవదహనం..?

ఐదు వరకూ కరోనా సెలవులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>