PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dushyanth-chowthala-shock-bjp-on-farmers-protestef7a22c6-51de-4d6e-a053-ed261f736057-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dushyanth-chowthala-shock-bjp-on-farmers-protestef7a22c6-51de-4d6e-a053-ed261f736057-415x250-IndiaHerald.jpgరైతుల ఆందోళనతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీజేపీకి మరో షాకిచ్చారు.. ఆ పార్టీ మిత్రపక్షం జన్‌నాయక్ జనతా పార్టీ అధినేత దుశ్యంత్ చౌతాలా. రైతులకు కనీస మద్దతు ధర అందించలేనని తాను భావించిన రోజున తన పదవికి రాజీనామా చేస్తానని హర్యానా ఉప ముఖ్యమంత్రి కూడా అయిన దుశ్యంత్ చౌతాలా ప్రకటించారు.dushyanth chowthala;mithra;delhi;bharatiya janata party;narendra singh tomar;haryana - chandigarh;narendra singh tomar.;congress;రాజీనామా;chief minister;job;minister;central government;allu sneha;punjab;party;narendraబీజేపీకి షాకిచ్చిన దుశ్యంత్ చౌతాలా?బీజేపీకి షాకిచ్చిన దుశ్యంత్ చౌతాలా?dushyanth chowthala;mithra;delhi;bharatiya janata party;narendra singh tomar;haryana - chandigarh;narendra singh tomar.;congress;రాజీనామా;chief minister;job;minister;central government;allu sneha;punjab;party;narendraThu, 24 Dec 2020 21:22:33 GMTపార్టీ మిత్రపక్షం జన్‌నాయక్ జనతా పార్టీ అధినేత దుశ్యంత్ చౌతాలా. రైతులకు కనీస మద్దతు ధర అందించలేనని తాను భావించిన రోజున తన పదవికి రాజీనామా చేస్తానని హర్యానా ఉప ముఖ్యమంత్రి కూడా అయిన  దుశ్యంత్ చౌతాలా ప్రకటించారు. రాజీనామా అంశం కంటే ముందు వ్యవసాయ చట్టాల్లో చాలా సవరణలు చేయాల్సి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయమై కేంద్రానికి ఇప్పటికే తాము చాలా సూచనలు చేశామని, వాటిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని చెప్పారు దుశ్యంత్ చౌతాలా.

                   రైతుల నిరవధిక నిరసనతో చిక్కుల్లో ఉన్న బీజేపీకి దుశ్యంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇబ్బందిగా మారాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్ర పక్షమైన శిరోమణి అకాలీదళ్ పార్టీ ఎన్డీయే నుంచి బయటికి వచ్చింది. అకాలీదళ్‌లాగే జేజేపీ కూడా ఎన్డీయే నుంచి బయటకు వచ్చి రైతులకు మద్దతు ఇవ్వాలంటూ దుశ్యంత్‌పై రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. ఈ చట్టాలపై పంజాబ్ తర్వాత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత హర్యానా నుంచే వస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, హర్యానాలో బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ స్నేహం వీడి రైతులకు మద్దతు ఇవ్వాలని దుశ్యంత్‌ను రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే దుశ్యంత్ చౌతాలా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.

               మరోవైపు ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళన కొనసాగుతోంది. చలి వణికిస్తున్నా లెక్క చేయకుండా అక్కడే భైఠాయించారు అన్నదాతలు. చర్చలకు సిద్దమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పినా.. రైతు సంఘాలు మాత్రం పట్టించుకోవడం లేదు. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు అన్నదాతలు.


టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ.. ఆమె ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>