MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sohel41ece68f-42e5-491c-99ba-936f814680b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sohel41ece68f-42e5-491c-99ba-936f814680b3-415x250-IndiaHerald.jpgచాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎట్టకేలకు ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ నిలిచాడు. అలాగే రన్నర్ గా అఖిల్ నిలిచాడు. అయితే సోహైల్ మాత్రం తెలివిగా పాతిక లక్షలు తీసుకుని బయట పడ్డాడు. మరో పక్క విన్నర్ కు రన్నర్ కు రాని అవకాశాలు సోహైల్ కు రావడం విశేషం. తాజాగా ఆయన హీరోగా ఒక సినిమా ఖరారైంది. జార్జి రెడ్డి,ప్రెజర్ కుక్కర్ సినిమాల నిర్మాత అప్పి రెడ్డి సోహైల్ తో ఒక సినిమాని నిర్మించనున్నారు. శ్రీనివాస్ వింజనంపాటి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించనున్నారు.tollywood;chiranjeevi;abhijith;akhil akkineni;srinivas;cinema;bigboss;producer;event;february;producer1;winner;lella appi reddy;winner1;george reddy;athidhi;reddy;vబిగ్ బాస్ సోహైల్ హీరోగా సినిమా.. దర్శకుడు ఎవరంటే ?బిగ్ బాస్ సోహైల్ హీరోగా సినిమా.. దర్శకుడు ఎవరంటే ?tollywood;chiranjeevi;abhijith;akhil akkineni;srinivas;cinema;bigboss;producer;event;february;producer1;winner;lella appi reddy;winner1;george reddy;athidhi;reddy;vThu, 24 Dec 2020 11:00:00 GMTచాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎట్టకేలకు ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ నిలిచాడు. అలాగే రన్నర్ గా అఖిల్ నిలిచాడు. అయితే సోహైల్ మాత్రం తెలివిగా పాతిక లక్షలు తీసుకుని బయట పడ్డాడు. మరో పక్క విన్నర్ కు రన్నర్ కు రాని అవకాశాలు సోహైల్ కు రావడం విశేషం. తాజాగా ఆయన హీరోగా ఒక సినిమా ఖరారైంది. జార్జి రెడ్డి,ప్రెజర్ కుక్కర్ సినిమాల నిర్మాత అప్పి రెడ్డి సోహైల్ తో ఒక సినిమాని నిర్మించనున్నారు. శ్రీనివాస్ వింజనంపాటి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. 

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో చిరంజీవి సోహైల్ కు సహాయ పడతాను అని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. సోహైల్ తాను ఒక సినిమా తీస్తాను దానికి మీరు సపోర్ట్ చేయాలని చిరంజీవిని కోరాడు. అయితే ఎలాంటి సపోర్ట్ నుంచి కోరుకుంటున్నారని చిరంజీవి అడిగితే తాను ఒక సినిమా మంచి సినిమా తీస్తానని దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది ఏమైనా పెట్టుకుంటే దానికి తప్పకుండా వచ్చి మిమ్మల్ని దీవించాలని కోరాడు.

దానికి చిరంజీవి తన చేతుల మీదుగానే ఆ ఈవెంట్ జరిపిస్తా అంటూ మాట ఇచ్చాడు. అంతేగాక ఈ సినిమాలో ఏదైనా చిన్న అతిధి పాత్ర ఉన్నా చేస్తానని ఆయన సోహైల్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇది సోహైల్ నిర్మాణంలోని సినిమా కాదు కాబట్టి మరి దీనికి చిరంజీవి సపోర్ట్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అలాగే ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా మేకర్స్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.


పుష్ప పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుందిగా..?

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>