MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/amala-pal10737fac-1c88-430c-93ad-6875335638d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/amala-pal10737fac-1c88-430c-93ad-6875335638d0-415x250-IndiaHerald.jpgఅమలా పాల్ తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా, ఆమెకు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. తన అంద చందాలతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఇక మెగా హీరోల పుణ్య‌మా అని స్టార్ హీరోయిన్ అయింది. చ‌ర‌ణ్ నాయ‌క్.. బ‌న్నీ ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాల్లో న‌టించింది ఈ భామ.amala pal;amala akkineni;amala paul anaka;bhama;samantha;tara;vedhika;cinema;telugu;tamil;heroine;traffic police;lust stories;chitram‘ఆహా’ వెబ్ సిరీస్‌లో నటించనున్న తమిళ ముద్దుగుమ్మ..!?‘ఆహా’ వెబ్ సిరీస్‌లో నటించనున్న తమిళ ముద్దుగుమ్మ..!?amala pal;amala akkineni;amala paul anaka;bhama;samantha;tara;vedhika;cinema;telugu;tamil;heroine;traffic police;lust stories;chitramThu, 24 Dec 2020 10:00:00 GMTఅమలా పాల్ తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా, ఆమెకు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. తన అంద చందాలతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఇక మెగా హీరోల పుణ్య‌మా అని స్టార్ హీరోయిన్ అయింది. చ‌ర‌ణ్ నాయ‌క్.. బ‌న్నీ ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాల్లో న‌టించింది ఈ భామ. అయినా కూడా ఎందుకో కానీ ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు అయితే రాలేదు ఈ ముద్దుగుమ్మకు. దాంతో త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌కు వెళ్లిపోయింది ఈ భామ‌.

ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్ ‌ల హవా కొనసాగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టడంతో బడా హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ ‌ల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ ప్లాఫ్ ఫామ్‌ లకు రోజురోజుకీ పెరుగుతోన్న ఆదరణే దీనికి కారణం. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో విడుదల కానున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి తమిళ నటి అమలా పాల్ ఓకే చెప్పారు.

 అయితే బెజవాడ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై నటి అమలాపాల్. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఈ అందాల తార ప్రస్తుతం వెబ్ సిరీస్ ‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నెట్ ‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్‌లో నటిస్తోన్న అమలా పాల్.. ఆహా ఓటీటీ వేదిక కోసం ‘కుడి ఎడమైతే’ అనే మరో తెలుగు వెబ్‌సిరీస్ ‌లో నటిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘యు టర్న్’ చిత్ర దర్శకుడు పవన్‌ కుమార్‌ తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్‌ లో నటించడానికి ఓకే చెప్పారు. ఇక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌ ను 8 భాగాలుగా తీసుకురానున్నారు. ఇందులో అమలాపాల్ పోలీస్ ఆఫీసర్ ‌గా కనిపిస్తుండడం విశేషం.


రైతులతో కఠినంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ఎంజీఆర్‌‌ గా అరవిందస్వామి కొత్త లుక్ చూశారా.. అదిరిపోయింది!

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>