PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anam6f45f9df-cc29-4123-a1c7-8e0e0d02ea03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anam6f45f9df-cc29-4123-a1c7-8e0e0d02ea03-415x250-IndiaHerald.jpgరామనారాయణరెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. వీరి కుటుంబం చాలాకాలం నుంచి రాజకీయాల్లో ఉంది. నెల్లూరు జిల్లాలో వీరి కుటుంబం రాజకీయాల్లో పెద్ద పాత్రనే పోషించింది. అయితే, కొన్ని రాజకీయ పరిణామాల వల్ల రామనారాయణరెడ్డి వైసీపీలో చేరారు. ప్రస్తుతం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రామనారాయణరెడ్డిని ఇటీవల కాలంలో వైసీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నారట. anam;auto;mithra;tiru;anam ramanarayana reddy;mp;government;tirupati;y s vivekananda reddy;assembly;mla;minister;husband;ycp;venkatagiri;reddy;anam rama narayana reddy;party;shatru1;santoshamఅంటీముట్టనట్లు గా ఆనంఅంటీముట్టనట్లు గా ఆనంanam;auto;mithra;tiru;anam ramanarayana reddy;mp;government;tirupati;y s vivekananda reddy;assembly;mla;minister;husband;ycp;venkatagiri;reddy;anam rama narayana reddy;party;shatru1;santoshamThu, 24 Dec 2020 16:22:02 GMTఅంటీముట్టనట్లు ఆనం 
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో  వైసీపీలో ఆందోళన

రామనారాయణరెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. వీరి కుటుంబం చాలాకాలం నుంచి రాజకీయాల్లో ఉంది. నెల్లూరు జిల్లాలో వీరి కుటుంబం రాజకీయాల్లో పెద్ద పాత్రనే పోషించింది. అయితే, కొన్ని రాజకీయ పరిణామాల వల్ల రామనారాయణరెడ్డి వైసీపీలో చేరారు. ప్రస్తుతం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రామనారాయణరెడ్డిని ఇటీవల కాలంలో వైసీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నారట. సీనియర్‌ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆనం గుర్రుగా ఉన్నారట. అంతేకాదు కనీసం తన నియోజకవర్గంలో కూడా వైసీపీ నేతలకు ఇచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వడం లేదని, జూనియర్ల కంటే తనను తక్కువగా చూస్తున్నారని కొంతకాలం నుంచి పార్టీ నేతలపై ఆయన అలకబూనారు. అయినా చేసేది ఏమీలేక కామ్‌ అయిపోయారు. తన అవసరం పార్టీకి రాకపోతుందా.. అప్పుడు చూసుకందాం అని ఎదురుచూస్తున్నారు.

ఆయన ఎదురుచూస్తున్న అవకాశం తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక రూపంలో వచ్చింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే స్థానం తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో ఉంది. అక్కడ ఎంపీ ఇటీవల కాలంలో మరణించడంతో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలవాలంటే ఆనం రామనారాయణ రెడ్డి సహకారం ఎంతో అవసరం. కానీ, ఇన్నాళ్ల నుంచి ఆయనను దూరం పెట్టిన నేతలు ఇప్పుడు ఆయనపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనినే ఆయన ఆయుధంగా మలుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గానీ శాశ్వత శత్రువులు గానీ ఉండరని తాజాగా వ్యాఖ్యానించారు. త్వరలో జరగబోయే తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో ఆనం కుటుంబీకుల మార్క్‌ ఏంటో చూపిస్తానని కూడా చెప్పారు. ఆనం వివేకానందరెడ్డి మృతి తర్వాత తమ కుటుంబం నెల్లూరు నగరానికి దూరమైందని భావించడం కూడా సరికాదన్నారు. నగరంలోని ప్రతి కుటుంబంలోనూ తమ అభిమానులున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీ గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తున్నాయి. వైసీపీతో ఇప్పటికే అంటీముట్టనట్టుగా ఉంటున్న రామనారాయణరెడ్డి ఇప్పుడు ఎందుకీ వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన వైసీపీకి హ్యాండిస్తారా.. ఇతర పార్టీలకు మద్దతు తెలుపుతారా అన్న అనుమానాలు వారిని నిద్రపోనివ్వడం లేదట. ఒకవేళ ఇదే జరిగితే వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న భావనలో జగన్‌ పరివారం ఉందని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారట. మొత్తానికి తనకూ ఓ సమయం వచ్చిందని ఆనం రామనారాయణరెడ్డి సంతోషంగా ఉన్నారట. అయితే, ఆనం వ్యాఖ్యల వెనుక అంతరార్ధం ఏమిటో అర్ధం కాక వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారట.




సిఎంకు తోడుగా రెండు రాష్ట్రాల నేతలు...?

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !

తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..!

బుడుగు: పిల్లలను శక్తి వంతులుగా చేసే దివ్య ఔషదం ఇదే..!

అలా చేస్తే ట్యాన్ కు టాటా చెప్పవచ్చా?

ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>