PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sec-new-decision-likely-to-review-on-localbody-election-dates6bdf9d77-3889-4402-8776-fe89fa816789-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sec-new-decision-likely-to-review-on-localbody-election-dates6bdf9d77-3889-4402-8776-fe89fa816789-415x250-IndiaHerald.jpgస్థానిక ఎన్నికల వ్యవహారంపై హైకోర్టు తాజాగా ఇచ్చిన సూచన.. ఎన్నికల కమిషన్ కి అనుకూలం అంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టు తలుపు తట్టాలా లేక, అధికారుల బృందాన్ని చర్చలకు పంపాలా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఆలోచన ఎలా ఉన్నా.. ఇప్పటి వరకూ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. తాజా పరిస్థితుల దృష్ట్యా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్తున్నామంటూ, ఫిబ్రవరిలో ఎన్నికలంటూ నవంబర్ 17న ఎస్ఈసీ ఇచ్చిన ప్రొసీడింగ్nimmagadda;kumaar;vedhika;district;high court;january;november;tdp;local language;central government;ycp;international;coronavirusనిమ్మగడ్డకు ఇక ఆ ఛాన్స్ లేనట్టే..నిమ్మగడ్డకు ఇక ఆ ఛాన్స్ లేనట్టే..nimmagadda;kumaar;vedhika;district;high court;january;november;tdp;local language;central government;ycp;international;coronavirusThu, 24 Dec 2020 12:00:00 GMTస్థానిక ఎన్నికల వ్యవహారంపై హైకోర్టు తాజాగా ఇచ్చిన సూచన.. ఎన్నికల కమిషన్ కి అనుకూలం అంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టు తలుపు తట్టాలా లేక, అధికారుల బృందాన్ని చర్చలకు పంపాలా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఆలోచన ఎలా ఉన్నా.. ఇప్పటి వరకూ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. తాజా పరిస్థితుల దృష్ట్యా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్తున్నామంటూ, ఫిబ్రవరిలో ఎన్నికలంటూ నవంబర్ 17న ఎస్ఈసీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ తో అసలు గొడవ మొదలైంది. ప్రొసీడింగ్స్ ఆపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు మెట్లెక్కగా.. కరోనాను బూచిగా చూపి ఎన్నికలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారనే వాదన ఎస్ఈసీ తెరపైకి తెచ్చారు. వీరిద్దరి మధ్య సామరస్య పరిష్కారం కోసం హైకోర్టు చర్చలు జరపాలని సూచించింది. తేదీ, వేదిక ఎస్ఈసీ నిర్ణయిస్తుందని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, లేదా ముఖ్య కార్యదర్శి హోదాకు తగ్గని ముగ్గురు అధికారులను ప్రభుత్వం తరపున చర్చలకు పంపాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు చర్చలు జరిగినా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేదనే విషయాన్ని అధికారులు ఎన్నికల కమిషన్ కు తెలియజేస్తారు.

నవంబర్ 17 నాటికి.. ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. రూపాంతరం చెందిన కరోనా వైరస్ వ్యాపిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఎస్ఈసీ మరీ అంత మొండి పట్టుదలకు పోకపోవచ్చు. అంతర్జాతీయ రవాణాపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దులు మూతపడబోవనే గ్యారెంటీ లేదు. మరోవైపు కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియపై కూడా స్థిరాభిప్రాయంతో ఉంది. జనవరి నెలలో వ్యాక్సినేషన్ కోసం అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఏపీలో జిల్లా స్థాయి, మండల స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ టీమ్ లో ఎంతమంది ఉండాలి, ఎవరెవరు ఉండాలి, టీకాలు ఎక్కడ నిల్వ చేయాలి, ఎవరికి ముందుగా వేయాలి.. అనే విషయాలన్నీ ఒక్కొక్కటే ఫైనల్ అవుతున్నాయి. ఈ దశలో సిబ్బందితో ఎన్నికల డ్యూటీ చేయీస్తామంటే అది సాధ్యం కాదు. ఉన్న సిలబస్ పూర్తి చేయడానికే టీచర్లు కిందా మీదా పడుతున్న పరిస్థితుల్లో.. వారికి ఎన్నికల డ్యూటీ వేసి, పోలింగ్, రీపోలింగ్ పేరుతో స్కూళ్లకు సెలవలు ఇవ్వడం కూడా సరికాదనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది.

అంతిమంగా ప్రజా ప్రయోజనమే ముఖ్యం అంటూ హైకోర్ట్ కీలక సూచన చేసిన నేపథ్యంలో.. ఇవన్నీ ప్రజా ప్రయోజనాలే కాబట్టి.. ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ దఫా మరీ అంత పట్టుదలతో ఉంటారని చెప్పలేం. ఆయన పదవిలోనుంచి దిగిపోయేలోగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధపడుతుందని కూడా ఆశించలేం. సో.. హైకోర్టు సూచనల ప్రకారం జరిగే చర్చల్లో.. ఎన్నికల వాయిదానే తుది నిర్ణయం అవుతుందనేది రాజకీయ వర్గాల అంచనా.


రజనీ కొంప ముంచిన కరోనా..అంతా అప్సెట్ !

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>