PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chandrababuku-anta-aatram-enduku49d63d21-0b0f-4842-9f9d-00256bdf0648-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chandrababuku-anta-aatram-enduku49d63d21-0b0f-4842-9f9d-00256bdf0648-415x250-IndiaHerald.jpgసర్దార్ గౌతు లచ్చన్నపై మంత్రి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతలను అరెస్ట్ చేసారు. ఇక దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. శ్రీకాకుళంలో టీడీపీ నేతల అరెస్టు అప్రజాస్వామికం అని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న వైసీపీ మంత్రులు, నేతలను వదిలి తెదేపా నేతలను అరెస్టు చేయడం దుర్మార్గం అని ఆరోపణలు చేసారు. appalaraju,ycp,ap;amala akkineni;prema;shyam;sundar;tiru;jagan;andhra pradesh;mp;srikakulam;police;k s ravikumar;love;minister;arrest;letter;tdp;ycp;gottipati ravi kumar;chatrapathi shivaji;sivaji;reddy;party;mantraదుమారం రేపుతున్న ఏపీ మంత్రి వ్యాఖ్యలుదుమారం రేపుతున్న ఏపీ మంత్రి వ్యాఖ్యలుappalaraju,ycp,ap;amala akkineni;prema;shyam;sundar;tiru;jagan;andhra pradesh;mp;srikakulam;police;k s ravikumar;love;minister;arrest;letter;tdp;ycp;gottipati ravi kumar;chatrapathi shivaji;sivaji;reddy;party;mantraThu, 24 Dec 2020 16:10:00 GMTమంత్రి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతలను అరెస్ట్ చేసారు. ఇక దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. శ్రీకాకుళంలో టీడీపీ నేతల అరెస్టు అప్రజాస్వామికం అని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న వైసీపీ మంత్రులు, నేతలను వదిలి తెదేపా నేతలను అరెస్టు చేయడం దుర్మార్గం అని ఆరోపణలు చేసారు.

శ్రీకాకుళంలో కింజారపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, గౌతు శిరీషలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు. పౌరుల హక్కులను జగన్ రెడ్డి కాలరాస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తామని మంత్రి సీదిరి అప్పల రాజు  చేసిన వ్యాఖ్యలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని నిలదీశారు.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన సర్దార్ గౌతు లచ్చన్న గారిని అవమానించిన వైసీపీ నేతలు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసారు. అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలి అని కోరారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... గౌతు లచ్చన్న పై మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. అప్పలరాజు క్షమాపణలు చెప్పాలి అని కోరారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అని విమర్శించారు. పలాసలో 144 సెక్షన్ అమలులో ఉంటే వైసీపీ నేతలు బయటికి ఎలా వచ్చారు? అని ప్రశ్నించారు. లచ్చన్న పై వైసీపీ నేతలకు ఇప్పుడే ప్రేమ పుట్టుకొచ్చిందా? అని నిలదీశారు. వైసీపీ నేతలు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతుంటే పోలీసులు ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు.


సిఎంకు తోడుగా రెండు రాష్ట్రాల నేతలు...?

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !

తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..!

బుడుగు: పిల్లలను శక్తి వంతులుగా చేసే దివ్య ఔషదం ఇదే..!

అలా చేస్తే ట్యాన్ కు టాటా చెప్పవచ్చా?

ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>