PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greenindiachallenge519bf1e5-6d47-448b-8bc4-f60c6446ac3c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greenindiachallenge519bf1e5-6d47-448b-8bc4-f60c6446ac3c-415x250-IndiaHerald.jpgగ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై తయారు చేసిన పాటను మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతను పాట రూపంలో తీసుకురావడం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేసారు. దేశపతి శ్రీనివాస్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. greenindiachallenge;kcr;karan johar;kumaar;indra;poorna;rahul new;rahul;santhosh;srinivas;k l rahul;india;santdinesh chandra yadavosh kumar;telangana;joginapally santosh kumar;rajya sabha;mp;chief minister;minister;rahul sipligunj;allola indrakaran reddy;reddy;santhossh jagarlapudiహరితహారం... తెలంగాణలో 4 % పెరిగిన పచ్చదనంహరితహారం... తెలంగాణలో 4 % పెరిగిన పచ్చదనంgreenindiachallenge;kcr;karan johar;kumaar;indra;poorna;rahul new;rahul;santhosh;srinivas;k l rahul;india;santdinesh chandra yadavosh kumar;telangana;joginapally santosh kumar;rajya sabha;mp;chief minister;minister;rahul sipligunj;allola indrakaran reddy;reddy;santhossh jagarlapudiThu, 24 Dec 2020 22:44:41 GMTహరిత హారం కార్యక్రమం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 4 శాతం పచ్చదనం పెరిగిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై తయారు చేసిన పాటను పద్మ శ్రీ వనజీవి రామయ్యతో కలిసి అరణ్య భవన్ లో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పర్యావరణం పట్ల ప్రతీ ఒక్కరూ బాధ్యతగా, ప్రేమగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైంది అన్నారు ప్రపంచ మానవాళి ముందు ఇప్పుడు ఉన్న అతిపెద్ద సవాల్ పర్యావరణ రక్షణే అని మంత్రి అన్నారు.

రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్  హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.ముఖ్యమంత్రి చేపట్టిన తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను దేశ వ్యాప్తంగా చేశారని అన్నారు.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఒక్కొక్కరు మూడు మొక్కలను నాటుతూ, మరో ముగ్గురిని నాటాల్సిందిగా సవాల్ చేయటం, ఒక గొలుసు కట్టులాగా విస్తరిస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ హరిత భారతాన్ని స్వప్నించాలని, ఆకు పచ్చని తెలంగాణ సాధనే ధ్యేయంగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. 


క్షీణిస్తున్న అడవులు ప్రాణాధారమైన ఆక్సీజన్ ను తగ్గిస్తున్నాయని, ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షిస్తూ పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉందని వనజీవి రామయ్య అన్నారు . నిరంతర కృషి, పట్టుదలతోనే అడవులు, చెట్ల పెంపకం సాధ్యమౌతుందన్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ స్థాయిలో పర్యావరణ హితానికి పాల్పడాలని, పచ్చదనం పెంపు ఉద్యమాన్ని హరిత భావజాల వ్యాప్తిలాగా చేపట్టాలని తెలిపారు. దేశపతి శ్రీనివాస్ పాటను రాయగా  రాహుల్ సిప్లిగంజ్ ఆలపించి, నటించాడు.  పూర్ణ చందర్ దర్శకత్వం వహించగా శిరీష్ కొరియోగ్రఫీ,  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ నిర్మాణ బాధ్యతలను నెరవేర్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతను పాట రూపంలో తీసుకువచ్చి, మరింత మందికి దగ్గర చేసేందుకు కృషి చేసిన పాట రూపకర్తలను ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.




రామ్ రెడ్.. ఇస్మార్ట్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ..!

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>