PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth25d22e2d-130e-4c7e-b788-471a696371c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth25d22e2d-130e-4c7e-b788-471a696371c8-415x250-IndiaHerald.jpgఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేసేశారు. దీంతో పీసీసీ పదవిపై కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆశపడుతూ వచ్చారు. వీరిలో ప్రముఖంగా కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు ముందంజలో ఉన్నాయిrevanth;kumaar;rahul new;rahul;revanth;venkat;delhi;hyderabad;k l rahul;komati;uttam kumar reddy nalamada;rahul gandhi;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;రాజీనామా;media;tpcc;rahul sipligunj;reddyఅనుకున్నదే జరిగింది.. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఫిక్స్?అనుకున్నదే జరిగింది.. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఫిక్స్?revanth;kumaar;rahul new;rahul;revanth;venkat;delhi;hyderabad;k l rahul;komati;uttam kumar reddy nalamada;rahul gandhi;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;రాజీనామా;media;tpcc;rahul sipligunj;reddyThu, 24 Dec 2020 15:17:05 GMTకాంగ్రెస్ ఘోర పరాజయం పొందడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేసేశారు. దీంతో పీసీసీ పదవిపై కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆశపడుతూ వచ్చారు. వీరిలో ప్రముఖంగా కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు ముందంజలో ఉన్నాయి. కోమటిరెడ్డి పీసీసీ పదవి దక్కేది తనకేనంటూ ఏకంగా మీడియా ముందే చెప్పారు. అయితే పరిస్థితులను చూస్తే.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.

అటు ఢిల్లీతో పాటు ఇటు హైదరాబాద్‌లోనూ ప్రస్తుతం ఈ అంశంపైనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పీసీసీకి సంబంధించి కోమటిరెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు అధిష్టానం మరోమారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవికోసం తీవ్రంగా పోటీపడిన కోమటిరెడ్డికి అధిష్టానం సీడబ్ల్యూసీ మెంబర్ షిప్ ఇస్తున్నట్లు సమాచారం. సీడబ్ల్యూసీతో పాటు మరిన్ని పనులను ఆయనకు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ బాధ్యతలను ఇచ్చేందుకు కోమటిరెడ్డి కూడా అంగీకరించారని.. అధికారికంగా రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా సమాచారం అందుతోంది.

మరోపక్క రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వొద్దంటూ అధిష్టానానికి అనేక మంది కాంగ్రెస్ నేతలు లేఖలు రాశారు. ఇప్పుడు వారందరికి కూడా కాంగ్రెస్ అధిష్టానం నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కూడా పీసీసీ చీఫ్ బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించడానికే మొగ్గుచూపారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి తక్కువ సమయమే అయింది. కాంగ్రెస్‌లో దశాబ్దాల నుంచి కొనసాగుతున్న సీనియర్లు ఉన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలను అప్పగిస్తే వారంతా అలగడం, వ్యతిరేకత చూపడం ఖాయం.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన వ్యతిరేకులను ఏ విధంగా కలుపుకుపోతారనేది ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వన్ మ్యాన్ ఆర్మీగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు పీసీసీ పదవి దక్కితే ఆయన పార్టీని సమన్వయంగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ సీనియర్లు ముందుకు సాగుతారా లేక పార్టీని వీడతారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.


ఈ బ్రా వేసుకుంటే కరోనా పోతుందా..!?

ఆదివాసీ గూడెంలో పవన్ కళ్యాణ్

చిరంజీవిపై విరుచుకుపడ్డ బాలకృష్ణ. ఆ నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఆదివాసీలు పాడిన ఆ పాట వింటుంటే ఆయన రాసిన ‘వనవాసి’ గుర్తుకొచ్చింది: పవర్ స్టార్ పవన్ కల్యాణ్

ఇంకు ఖర్చు వృధా ఎందుకు.. అందుకే పేరు మార్చుకున్నా..!

ప్రేమలో పడ్డ వరుణ్ తేజ్.ఆమె ఎవరో తెలుసా..?

రామ్ రెడ్ ట్రైలర్ చూశారా.. డబుల్ రోల్‌లో అదరగొట్టాడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>