PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/another-turning-point-on-jagan-govte602dd30-39ce-4484-83bf-7732549b69bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/another-turning-point-on-jagan-govte602dd30-39ce-4484-83bf-7732549b69bf-415x250-IndiaHerald.jpgమాట తప్పను.. మడమ తిప్పను అనే పదానికి ఏపీ సీఎం జగన్ కట్టుబడే ఉంటున్నారు. ప్రజలకు మంచి చేయడం కోసం ఏం చేసేందుకైనా జగన్ వెనకాడడం లేదు. ఇచ్చిన హామీ ఇచ్చినట్టుగా నెరవేరుస్తూ, తను గొప్ప మనసును చాటుకుంటూ వస్తున్నారు. ఇక విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం లో కిడ్నీ బాధితుల గురించి అందరికీ తెలిసిందే. అక్కడ భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల, ఆ నీటిని ఉద్దాన ప్రాంత ప్రజలు తాగడం వంటి కారణాలతో మొదటి నుంచి ఈ ప్రాంత వాసులు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. తమ బాధను తీర్చాలంటూ అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్jagan pavan kalyan uddanam kidney ysrcp tdp cbn ap;pawan;kalyan;jagan;andhra pradesh;janasena;district;mandalam;minister;cheque;tdp;janasena partyజగన్ ను అక్కడ చేతులెక్కి మొక్కుతున్నారు ! పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకోవాల్సిందే ?జగన్ ను అక్కడ చేతులెక్కి మొక్కుతున్నారు ! పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకోవాల్సిందే ?jagan pavan kalyan uddanam kidney ysrcp tdp cbn ap;pawan;kalyan;jagan;andhra pradesh;janasena;district;mandalam;minister;cheque;tdp;janasena partyThu, 24 Dec 2020 07:53:43 GMTఏపీ సీఎం జగన్ కట్టుబడే ఉంటున్నారు. ప్రజలకు మంచి చేయడం కోసం ఏం చేసేందుకైనా జగన్ వెనకాడడం లేదు. ఇచ్చిన హామీ ఇచ్చినట్టుగా నెరవేరుస్తూ, తను గొప్ప మనసును చాటుకుంటూ వస్తున్నారు. ఇక విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం లో కిడ్నీ బాధితుల గురించి అందరికీ తెలిసిందే. అక్కడ భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల, ఆ నీటిని ఉద్దాన ప్రాంత ప్రజలు తాగడం వంటి కారణాలతో మొదటి నుంచి ఈ ప్రాంత వాసులు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. తమ బాధను తీర్చాలంటూ అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వాన్ని  వేడుకుంటూనే వచ్చేవారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం టిడిపి ప్రభుత్వం హయాంలో ఉద్దానం సమస్యను జనసేన తరపున తీసుకుని, టిడిపి పై ఒత్తిడి పెంచారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ చంద్రబాబు సైతం ఇచ్చారు. కానీ ఏపీ లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ సమస్య పరిష్కారం కాలేదు.



 ఇక ఎన్నికలకు ముందు పాదయాత్ర పెట్టిన జగన్ ఈ ప్రాంతంలోనూ పర్యటించడంతో వారి సమస్యలను కళ్లారా చూసి చలించిపోయారు. అధికారంలోకి రాగానే మీ బాధలు తీరుస్తాను అంటూ హామీ ఇవ్వడంతో పాటు, అధికారంలోకి రాగానే ఆ సమస్యలపై దృష్టి పెట్టారు. దీంతో 750 కోట్లతో భారీ వాటర్ గ్రిడ్ పథకాన్ని ఈ ప్రాంతానికి మంజూరు చేశారు. దీనికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేయడంతో ఉద్దానం ప్రాంత వాసుల్లో ఇప్పుడు ఆనందం వెల్లివిరుస్తోంది.



ఇప్పటి వరకు భూగర్భ జలాలు తాగుతూ, కిడ్నీ వ్యాధులకు గురైన ప్రజలు ఇకపై హిరా మండలంలోని, గొట్ట బ్యారేజ్ నుంచి నీటిని తీసుకొచ్చి వాటర్ గ్రిడ్ కు  అనుసంధానం చేయడం ద్వారా గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించే భారీ ప్రాజెక్టును ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని కారణంగా  శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ప్రజలకు సురక్షితమైన తాగునీరు దీని ద్వారా అందుతుంది. ఇప్పటి వరకు తప్పనిసరి పరిస్థితుల్లో తాగేందుకు అనువుకాని భూగర్భజలాలను అక్కడ ప్రాంతవాసులు తాగుతూ, కిడ్నీ వ్యాధులకు గురయ్యారు. ఇప్పుడు జగన్ నిర్ణయంతో సురక్షితమైన తాగునీరు రావడంతో పాటు, ఇకపై కిడ్నీ సమస్యలకు చెక్ పడినట్లే.




సాయి ధరమ్ తేజ్ వెనుక టోటల్ ఇండస్ట్రీ !

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>