PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/undavalli594086a0-7998-47c4-82b6-d9e1d62dcca8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/undavalli594086a0-7998-47c4-82b6-d9e1d62dcca8-415x250-IndiaHerald.jpgఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ మేధావి. ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంట్ లో ఉండాల్సిన నేత. కుల బలం, ధనబలం లేని ఆయన వర్తమాన రాజకీయాల్లో ఒక సాధారణ విశ్లేషకుడిగా మారిపోవడం కంటే విషాదం మరొకటి లేదు. అయితే ఉండవల్లి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాముకుడు. ఆయనకు పార్టీలు లేవు రాజకీయాలు అంతకంటే లేవు, పదవుల మీద ఆరాటం కూడా అసలు లేదు. ఈ విధంగా ఆలోచిస్తే ఈ రాష్ట్ర ప్రజలలో ఒకడిగా సగటు మనిషి ఆవేదనను ఆయన ప్రభుత్వానికి తెలియచేస్తున్నారు అనుకోవాలి. undavalli;kumaar;pragathi;bharatiya janata party;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;vundavalli aruna kumar;media;parliment;press;central government;ycp;undavalliఉండవల్లిని బెదిరిస్తున్నదెవరు...?ఉండవల్లిని బెదిరిస్తున్నదెవరు...?undavalli;kumaar;pragathi;bharatiya janata party;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;vundavalli aruna kumar;media;parliment;press;central government;ycp;undavalliThu, 24 Dec 2020 21:00:00 GMTఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ మేధావి. ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంట్ లో ఉండాల్సిన నేత. కుల బలం, ధనబలం లేని ఆయన వర్తమాన రాజకీయాల్లో ఒక సాధారణ  విశ్లేషకుడిగా మారిపోవడం కంటే విషాదం మరొకటి లేదు. అయితే ఉండవల్లి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాముకుడు. ఆయనకు పార్టీలు లేవు రాజకీయాలు అంతకంటే లేవు, పదవుల మీద ఆరాటం కూడా అసలు లేదు. ఈ విధంగా ఆలోచిస్తే ఈ రాష్ట్ర ప్రజలలో ఒకడిగా సగటు మనిషి ఆవేదనను ఆయన ప్రభుత్వానికి తెలియచేస్తున్నారు అనుకోవాలి.

ఉండవల్లి చెబుతున్నది తన గురించి కాదు, ఏపీ ప్రజల గురించి. ఉండవల్లి ఏపీ ప్రగతి విషయంలో రాజీ పడవద్దనే తన ప్రియ స్నేహితుడు వైఎస్సార్ కుమారుడు అయిన జగన్ కి చెబుతున్నారు. తప్పు చేయకు జగన్ అని ఒకటికి పదిమార్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వేసే ఎత్తులు జిత్తులు అన్నీ చూసేసిన ఉండవల్లి పోలవరం విషయంలో వారు గట్టిగానే టోకరా పెడతారు అని కూడా ముందు జాగ్రత్తగా వైసీపీ సర్కార్ ని అలెర్ట్ చేస్తున్నారు.

ఈ విషయంలో పరుషంగా కొంత మాట్లాడినా ఉందవల్లి చెప్పినవి అన్నీ కూడా అక్షర సత్యాలు అని జనమంతా ఒప్పుకుంటున్నారు. మేధావులు సైతం అదే నిజం అంటున్నారు. ఉండవల్లి జగన్ సర్కార్ ని పోలవరం విషయంలో గట్టిగా కడిగిపారేస్తున్నారు. అయితే జగన్ అంటే వీరాభిమానంతో పూనకం వచ్చినట్లుగా ఉండే సైకో ఫ్యాన్స్ తనను బెదిరిస్తున్నారని కూడా ఉండవల్లి తాజా ప్రెస్ మీట్ లో చెప్పడం విశేషం. అయితే తాను ఎవరి బెదిరింపులకు అసలు లొంగను అని ఉండవల్లి అంటున్నారు. తనను చంపేస్తామని బెదిరించే వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇంతకు ఇంత రెట్టించిన ఉత్సాహంతో తాను మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రభుత్వం తప్పులను కడిగేస్తాను అని ఉండవల్లి అంటున్నారు. ఉండవల్లి మీద ఇలాంటి బెదిరింపులకు ఎవరు దిగినా అది మంచి విధానం కాదు, అటు తిరిగి ఇటు తిరిగి ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ విషయంలో వైసీపీ సర్కార్ కూడా వారిని కనిపెట్టి పని పట్టాల్సి ఉంటుంది.





మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ

తెలంగాణ బీజేపీలో రాములమ్మకు కీలక బాధ్యతలు.. నమ్మకం నిలబెట్టుకుంటారా..?

ప్రియాంక చోప్రాకు షాకిచ్చిన భారత ప్రభుత్వం

ఆ రాష్ట్రము లో కర్ఫ్యూ లేదు నిర్ణయం వెనక్కి తీసుకున్న ప్రభుత్వం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>