MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-devisriprasadae19282a-87ff-480b-a082-c03c302b404a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-devisriprasadae19282a-87ff-480b-a082-c03c302b404a-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా పుష్ప. ఇప్పటికే ఈ ఏడాది ప్రధామంలో అలవైకుంఠపురములో సినిమా ద్వారా సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తో కూడా మరొక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని ఎంతో భారీగా ప్రతిష్టాత్మక రేంజిలో నిర్మిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో pushpa;devisriprasad;kumaar;allu arjun;devi sri prasad;prasad;rashmika mandanna;sukumar;hyderabad;cinema;festival;audio;heroine;success;posters;mythri movie makers;arjun 1;nijam;ala vaikunthapurramloo;massపుష్ప'తో అందరి అంచనాలు మించుతాను అంటున్నాడు ....??పుష్ప'తో అందరి అంచనాలు మించుతాను అంటున్నాడు ....??pushpa;devisriprasad;kumaar;allu arjun;devi sri prasad;prasad;rashmika mandanna;sukumar;hyderabad;cinema;festival;audio;heroine;success;posters;mythri movie makers;arjun 1;nijam;ala vaikunthapurramloo;massThu, 24 Dec 2020 23:16:37 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్  సినిమా పుష్ప. ఇప్పటికే ఈ ఏడాది ప్రధామంలో అలవైకుంఠపురములో సినిమా ద్వారా సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తో కూడా మరొక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని ఎంతో భారీగా ప్రతిష్టాత్మక రేంజిలో నిర్మిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై వారిలో మంచి అంచనాలు కూడా క్రియేట్ చేయడం జరిగింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత పక్కా మాస్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాపై ఆయన అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ  ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సాంగ్స్ ఎంతగా ప్రజాదరణ పొందాయో మనకు తెలిసిందే. ఇక వాటన్నిటినీ మించే విధంగా ప్రస్తుతం పుష్ప సాంగ్స్  ని ఎంతో అద్భుతంగా సిద్ధం చేశారట దేవిశ్రీ.

మొత్తం ఈ సినిమాలో 5 సాంగ్స్ ఉంటాయని వాటిలో ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఐటమ్ సాంగ్ అయితే థియేటర్స్ లో ఫాన్స్ ని అలానే ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇక రేపు ఆడియో రిలీజ్ తర్వాత తప్పనిసరిగా మరొకసారి దేవిశ్రీప్రసాద్ కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అందుకోవడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి ఇప్పుడు ప్రచారమవుతోన్న ఈ వార్త నిజమే అయితే నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ వార్త అని చెప్పక తప్పదు.....!!






రామ్ రెడ్.. ఇస్మార్ట్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ..!

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>