PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-keen-observation-on-village-secretariats3587fcbd-3b25-4770-b960-5799ec980107-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-keen-observation-on-village-secretariats3587fcbd-3b25-4770-b960-5799ec980107-415x250-IndiaHerald.jpgగ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిపై ఇప్పటికే పలు చోట్ల ఫిర్యాదులొస్తున్నా.. శాఖాపరమైన విచారణతో సరిపెడుతున్నారు అధికారులు. రాష్ట్ర స్థాయిలో వీరిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు, చర్యలు తీసుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తున్న 1902 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఇప్పుడు సచివాలయ సిబ్బంది పనితీరు మదింపు చేయబోతున్నారు. సిబ్బంది పనితీరుపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్న వారు ఈ నెంబర్ కి కాల్ చేసి వివరాలు చెప్పొచ్చని, సిబ్బంది పనితీరు నచ్చకపోతjagan;jagan;district;panchayati;grama sachivalayamగ్రామ సచివాలయ సిబ్బంది పనితీరు నచ్చలేదా..? 1902కి కాల్ చేయండి..గ్రామ సచివాలయ సిబ్బంది పనితీరు నచ్చలేదా..? 1902కి కాల్ చేయండి..jagan;jagan;district;panchayati;grama sachivalayamThu, 24 Dec 2020 09:00:00 GMT
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పనితీరుపై కచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు జగన్. సచివాలయ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఇటీవల వారిపై వచ్చిన కొన్ని ఫిర్యాదులను ప్రస్తావించారట. తెనాలిలో సచివాలయంలో పుట్టినరోజు వేడుకలు చేసుకున్న పంచాయతీ సెక్రటరీ, మరికొందరు వాలంటీర్లపై అధికారులు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఉదాహరణలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, భవిష్యత్ లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారని తెలుస్తోంది.

ప్రతి సచివాలయం వద్ద 1902 నంబరును కచ్చితంగా ప్రదర్శించాలని.. ప్రజలల సమస్యలు తెలియజేయడంతో పాటు సిబ్బంది పనితీరుపై ఫీడ్‌ బ్యాక్‌ తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.  గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ మేరకు తగిన సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో వ్యవసాయ కమిటీలు ఉన్నందున వాటితో సమన్వయం చేసుకునేందుకు గ్రామ స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. సచివాలయాల పనితీరు పారదర్శకంగా ఉండాలని, సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవాలని, తరచూ సచివాలయాలను తనిఖీ చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. 


అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>