PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/strainb8ca3cc3-118d-47b7-86e3-b909efe0fe10-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/strainb8ca3cc3-118d-47b7-86e3-b909efe0fe10-415x250-IndiaHerald.jpgకరోనా రూపాంతరంగా పిలుస్తున్న స్ట్రెయిన్ దానికంటే మరింత ప్రమాదకారి అని, మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని, కరోనా టీకా కూడా దాన్ని ఎదుర్కోలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు కొత్తరకం కరోనా అనే వార్త బైటకు రాగానే.. దానిపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాస్తవాలు అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా స్ట్రెయిన్ పై వచ్చే పుకార్లతో జనం మరింత ఆందోళనకు గురవుతున్నారే మాట మాత్రం వాస్తవం. strain;aquaకరోనా రూపాంతరం స్ట్రెయిన్ లక్షణాలివే..? జాగ్రత్తగా ఉండండి..కరోనా రూపాంతరం స్ట్రెయిన్ లక్షణాలివే..? జాగ్రత్తగా ఉండండి..strain;aquaThu, 24 Dec 2020 07:00:00 GMTఇంతకీ ఏంటీ స్ట్రెయిన్, దీని లక్షణాలు ఎలా ఉంటాయి..?
ప్రస్తుతానికి బ్రిటన్ లో స్ట్రెయిన్ జాడ తెలిసినట్టు చెబుతున్నారు. బ్రిటన్ లో కొంతమంది కొత్తరకం కరోనా బారిన పడ్డారని, అయితే లక్షణాల పరంగా ఎలాంటి తేడాలు లేకపోవడంతో పరీక్షల్లో మాత్రమే ఆ విషయం తెలుస్తోందని బ్రిటన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు స్ట్రెయిన్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. కరోనా వ్యాధిగ్రస్తుల్లో రెండు రకాలు ఉన్నారు. అసింప్టమాటిక్ కేసులు, సింప్టమాటిక్ కేసులు. జలుబు, దగ్గు, గొంతు రాపిడి, జ్వరం వంటి లక్షణాలతో కరోనా బారిన పడినవారంతా సింప్టమాటిక్. అసలు లక్షణాలేవీ లేకుండా కేవలం పరీక్ష ద్వారా కరోనా ఉందని తేలితే వారిని అసింప్టమాటిక్ అంటున్నారు. ఇలాంటి అసింప్టమాటిక్ వారి వల్లే చాలామందికి కరోనా సోకిందని, కొంతమంది వ్యాధిని తెలియకుండానే ఇతరులకు వ్యాపించారనే వార్తలు కూడా వచ్చాయి. మరి స్ట్రెయిన్ సంగతి ఏంటనేదానిపై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు.

కరోనా రూపాంతరం స్ట్రెయిన్ కేసుల్లో ఇప్పటి వరకూ ఎవరూ అసింప్టమాటిక్ గా లేరని వార్తలొస్తున్నాయి. అంటే లక్షణాలు లేకపోయినా కొవిడ్-19 పాజిటివ్ గా తేలింది కానీ.. లక్షణాలు లేకుండా ఎవరూ స్ట్రెయిన్ బారిన పడలేదట. రూపాంతరం చెందిన కరోనా సోకితే.. కచ్చితంగా జలుబు, దగ్గు, విపరీతమైన జ్వరం ఉంటుందని చెబుతున్నారు. మొత్తమ్మీద కరోనాపై లెక్కలేనన్ని పుకార్లు వచ్చినట్టే... ఇప్పుడు స్ట్రెయిన్ పై కూడా అంతకు మించి పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే అధికారికంగా ప్రభుత్వం కానీ, వైద్యులు కానీ ప్రకటన చేసే వరకు ఇలాంటి పుకార్లను నమ్మకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు నిపుణులు.


టీమిండియాకు రెండో టెస్ట్ కూడా ప్రతికూలంగానే ఉందా ??

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>