PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-minister-ktr-letter-to-piyush-goel-on-budgetadaaca6d-532f-40d6-93fd-117561f367f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-minister-ktr-letter-to-piyush-goel-on-budgetadaaca6d-532f-40d6-93fd-117561f367f9-415x250-IndiaHerald.jpgకేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు మంత్రి కేటిఆర్ లేఖ రాసారు. రానున్న బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి అని కేటిఆర్ కోరారు. హైదరాబాద్ ఫార్మా సిటీ కి మంత్రి కేటీఆర్ ప్రత్యేక నిధులు కోరారు. హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ కు కేంద్ర నిధులు ఇవాలి అని ఆయన లేఖలో వెల్లడించారు. నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రాథమిక మూలధనాన్ని వెంటనే అందించాలి అని ఆయన డిమాండ్ చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు రానున్న కేంద్ర బడ్జెట్లో ktr;ktr;hyderabad;india;piyush goyal;warangal;telangana;university;minister;letter;central government;international;zero;piyush chawlaకేంద్రానికి కేటిఆర్ లేఖ... కేంద్ర మంత్రి స్పందిస్తారా...?కేంద్రానికి కేటిఆర్ లేఖ... కేంద్ర మంత్రి స్పందిస్తారా...?ktr;ktr;hyderabad;india;piyush goyal;warangal;telangana;university;minister;letter;central government;international;zero;piyush chawlaThu, 24 Dec 2020 09:00:00 GMTకేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు మంత్రి కేటిఆర్ లేఖ రాసారు. రానున్న బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి అని కేటిఆర్ కోరారు. హైదరాబాద్ ఫార్మా సిటీ కి మంత్రి కేటీఆర్ ప్రత్యేక నిధులు కోరారు. హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ కు కేంద్ర నిధులు ఇవాలి అని ఆయన లేఖలో వెల్లడించారు. నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రాథమిక మూలధనాన్ని వెంటనే అందించాలి అని ఆయన డిమాండ్ చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు రానున్న కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

ప్రతిపాదిత రెండు ఇండస్ట్రియల్ కారిడార్ లకు సుమారు 5 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని పియూష్ గోయల్ కు ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్లను ముందుకు తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నదని ఆయన లేఖలో వివరించారు. అయితే ఇందులో కనీసం 50 శాతం నిధులను రానున్న బడ్జెట్లో కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ ఫార్మా క్లస్టర్ అయిన హైదరాబాద్ ఫార్మా సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తుందని ఇప్పటికే ఆ దిశగా కార్యచరణ మొదలైందని కేంద్రమంత్రి రాసిన లేఖలో మంత్రి వివరించారు .

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఆలోచనలను ఫార్మా సిటీ తో తెలంగాణ మరింత ముందుకు తీసుకుపోతుందన్న నమ్మకాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఫార్మా రంగంలో స్వదేశీ పరిశ్రమని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే దిశగా ఫార్మాసిటీ ఉంటుందని వివరించారు. జాతీయ ప్రాధాన్యత ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీ కి ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని దేశంలో ఎక్కడా లేని విధంగా జీరో లిక్విడ్ డిస్ ఛార్జ్, కామన్ ఎప్లూయంట్  ట్రీట్మెంట్ , ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ పార్క్, గ్లోబల్ ఫార్మా యూనివర్సిటీ, కామన్ డ్రగ్ డెవలప్మెంట్, టెస్టింగ్ లాబరేటరీ, స్టార్టప్ల కోసం ప్రత్యేక హబ్ లాంటి ఎన్నో వినూత్నమైన ఆలోచనలను హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రణాళికలో ఉంచామని చెప్పారు.


అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>