PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/those-employees-are-confused45290fee-933d-4b48-98de-258a0e7eed51-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/those-employees-are-confused45290fee-933d-4b48-98de-258a0e7eed51-415x250-IndiaHerald.jpgతెలంగాణలో రద్దయిన వీఆర్వో వ్యవస్థ అంశం ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిలా మారింది. సంస్కరణల్లో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది సర్కార్. వీఆర్వో వ్యవస్థను సీఎం కేసీఆర్ రద్దు చేశారు. నాలుగు నెలలు గడిచి పోయినా వారి సంగతి తేల్చకపోవడంతో ఆందోళన పెరుగుతోంది. రెవెన్యూ శాఖలో సమూల మార్పుల కోసం సీఎం కేసీఆర్ కొత్త చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారి వ్యవస్థను రద్దు చేసి నెలలు గడుస్తుంది. అయితే వారిని ఏ శాఖలో విలీనం చేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. those employees are confused;kcr;government;september;officeఅయోమయంలో ఆ ఉద్యోగులు.. !అయోమయంలో ఆ ఉద్యోగులు.. !those employees are confused;kcr;government;september;officeThu, 24 Dec 2020 14:00:00 GMTకేసీఆర్ రద్దు చేశారు. నాలుగు నెలలు గడిచి పోయినా వారి సంగతి తేల్చకపోవడంతో ఆందోళన పెరుగుతోంది.

రెవెన్యూ శాఖలో సమూల మార్పుల కోసం సీఎం కేసీఆర్ కొత్త చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారి వ్యవస్థను రద్దు చేసి నెలలు గడుస్తుంది. అయితే వారిని ఏ శాఖలో విలీనం చేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో వారు ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రెవెన్యూ శాఖలో ఇది వరకు కీలకంగా వ్యవహరించిన వీఆర్‌ఓలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని భావించిన ప్రభుత్వంవ్యవస్థను రద్దు చేసింది.  ఈ ఏడాది సెప్టెంబర్ 8న రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరి నుంచి భూ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కానీ  నెలలు దాటినా వేరే శాఖల్లో వారిని సర్దుబాటు చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.  ప్రతిరోజూ ఉదయం తహసీల్దార్ ఆఫీసులకు వెళ్లడం ఏపని చెబితే ఆ పని చేయడం చేస్తున్నారు. కొందరిని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పంపడంతో కమిషనర్లకు రిపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎక్కడా వీళ్లకంటూ రిజిస్టర్గానీ, అటెండెన్స్గానీ లేదు. అయితే అధికారులు మాత్రం అగ్రికల్చర్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ డిపార్ట్మెంట్లలోనే సర్దుబాటు చేస్తామని.. చెబుతున్నా.. పై నుంచి క్లారిటీ లేదు.

ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో అధికారులు జిల్లాకో తరహాలో డ్యూటీలు చేయిస్తున్నారని వీఆర్వోలు ఆవేదన చెందుతున్నారు. తమకంటూ ఓ గుర్తింపు లేకుండా పోయిందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలన్నది వీఆర్వోల అభ్యర్ధన. అర్హతలను బట్టి విధులు కేటాయించాలని కోరుతున్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ అంశం అయోమయంగా మారింది. ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఆ ఉద్యోగులు.






బామ్మ లక్ మామూలుగా లేదుగా.. పొరబాటున పోస్టు చేసిన 60వేలు ఎలా తిరిగొచ్చాయో చూడండి!

ఎంజీఆర్‌‌ గా అరవిందస్వామి కొత్త లుక్ చూశారా.. అదిరిపోయింది!

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>